హాట్‌హాట్‌గా సూపర్‌స్టార్ కూతురు.. సోషల్ మీడియాలో హల్‌చల్
2017 సంవత్సరంలో అగ్ర హీరోలు, హీరోయిన్ల కూతుర్లు బాలీవుడ్‌కు భారీగానే పరిచయం అవుతున్నారు. శ్రీదేవి కూతురు జాహ్నవి, సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీఖాన్, సునీల్ శెట్టి బిడ్డ అతియాశెట్టి తెరపైన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. వారి దారిలోనే ఒకప్పటి బాలీవుడ్ సూపర్‌స్టార్ గోవిందా కూతురు టీనా అహుజా కూడా రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఫోటోలు మీడియాలో వైరల్‌గా మారాయి.

గోవిందా కూతురిగా
బాలీవుడ్ నటుడు గోవిందా, సునీత కుమార్తె టీనా అహుజా సినీ ప్రపంచంలోకి ప్రవేశించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. సూపర్‌స్టార్‌గా మారేందుకు తన తండ్రి పడిన కష్టం ఆమెకు ఓ స్ఫూర్తిగా మారింది.

నట వారసురాలిగా
నటుడి వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేయడం ఆమెకు కొంత సులభమైనప్పటికీ.. ఆ హోదాను నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సిందే.

హాట్‌హాట్‌గా ఫొటోలు
నటులు ఎక్కువగా తమ కొడుకులనే వారసులుగా ప్రకటిస్తున్న సమయంలో ఇండస్ట్రీలోకి వస్తున్న టీనా ఇటీవల హాట్‌హాట్ ఫొటోలతో ఇంటర్నెట్‌లో సంచలనం రేపుతున్నది.

సల్మాన్‌తో కుదర్లేదు
తన కూతురు టీనా అహుజాను సల్మాన్ సరసన నటించడం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకొన్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల అది వర్కవుట్ కాలేదు. అంతేకాకుండా సల్మాన్, గోవిందా మధ్య విభేదాలకు కారణమైంది.

వెనుకకు తగ్గిన సల్మాన్
సల్మాన్ చిత్రం ద్వారా టీనాను పరిచయం చేయాలని గోవిందా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మీడియాలో కొన్ని రూమర్లు వచ్చాయి. దాంతో సల్మాన్ వెనుకకు తగ్గారు అనే వార్త బాలీవుడ్ వర్గాల్లో వినిపించింది.

గోవిందా, సల్మాన్ మంచి ఫ్రెండ్స్
ఒకప్పుడు సల్మాన్, గోవిందా మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. వారు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. బందా యే బిందాస్ హై, పార్ట్‌నర్, దీవానా మస్తానా చిత్రాల్లో నటించారు.

టీనా కెరీర్‌పై దృష్టి
ప్రస్తుతం మంచి బ్యానర్‌లో నటించడం ద్వారా బాలీవుడ్‌లో ఘనంగా ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో గోవిందా ఉన్నారు. అలా అయితేనే టీనా కెరీర్ బ్రహ్మండంగా ఉంటుందని గోవిందా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. తాజాగా బోల్డ్‌గా కనిపిస్తూ దిగిన ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











