twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గోవిందుడు అందరివాడేలే' ఆడియో డేట్ (న్యూ ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' కధానాయకునిగా క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో అగ్రనిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం ప్రస్తుతం లండన్ లోని పలు సుందరమైన ప్రదేశాలలో పాటల చిత్రీకరణ జరుపు కుంటోంది. ఈనెల 15న చిత్రం ఆడియోను అక్టోబర్ 1 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.

    శ్రీకాంత్, కాజల్అగర్వాల్, ప్రకాష్ రాజ్, కమలిని ముఖర్జీ, జయసుధ, ఎం యస్. నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసానిక్రిష్ణమురళి, కాదంబరి కిరణ్, కాశీ విశ్వనాద్, సమీర్, కారుమంచిరఘు, గిరిధర్, ప్రగతి, సత్య కృష్ణన్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, కెమెరా : సమీర్ రెడ్డి, సంగీతం: యువన్ శంకర్ రాజా, ఆర్ట్: అశోక్ కుమార్, ఎడిటింగ్: నవీన్, ఫైట్స్: పీటర్ హైన్స్,రామ్ లక్ష్మణ్, సమర్పణ: శివబాబు బండ్ల, బ్యానర్: పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్.

    స్లైడ్ షోలో ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రానికి సంబందించిన న్యూ ఫోటోస్....

    గోవిందుడు అందరి వాడేలే...

    గోవిందుడు అందరి వాడేలే...


    ''కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే చిత్రమిది. ప్రతీ సన్నివేశంలోనూ తెలుగుదనం ఉట్టిపడుతుంది. రామ్‌చరణ్‌ విదేశాల్లో పుట్టి పెరిగిన యువకుడి పాత్రలో కనిపిస్తాడు.

    రామ్ చరణ్ కొత్తగా..

    రామ్ చరణ్ కొత్తగా..


    తనవారికోసం సొంతూరికి వచ్చిన ఓ ఎన్నారై యువకుడు ఎలాంటి సందడిని సృష్టించాడన్నది ఇందులో ఆసక్తికరం. చరణ్‌ తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుంది.

    యువన్ శంకర్ రాజా సంగీతం

    యువన్ శంకర్ రాజా సంగీతం


    యువన్‌శంకర్‌ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్సవుతుందని చిత్ర దర్శక నిర్మాతలు అంటున్నారు.

    టీజర్

    టీజర్


    ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది.

    రామ్ చరణ్‌, కాజల్

    రామ్ చరణ్‌, కాజల్


    ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

    భారీ అంచనాలు

    భారీ అంచనాలు


    కృష్ణ వంశీ ఈ మధ్య కాస్త వెనక బడిపోయాడు. అయితే రామ్ చరణ్ నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.

    English summary
    Govindudu Andarivadele audio on 15th, film releaseing on 1st Oct.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X