రామ్ చరణ్ ‘బైక్’ వేలం వేయబోతున్నారు!
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో రామ్ చరణ్ వాడిన హార్లే డివిడ్ సన్ బైక్ వేలం వేయబోతున్నారట. రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఈ బైక్ ఖరీదు రూ. 30 లక్షలు. సినిమా విడుదలైన తర్వాత ఈ బైక్ వేలం వేయడానికి ప్లాన్ చేస్తున్నారట నిర్మాత బండ్ల గణేష్. గతంలో బాలయ్య ‘లెజెండ్' సినిమాలో ఉపయోగించిన హార్లే డేవిడ్సన్ బైక్ కూడా వేలం వేసిన సంగతి తెలిసిందే.
మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' కధానాయకునిగా క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో అగ్రనిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం అక్టోబర్ 1 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.

శ్రీకాంత్, కాజల్అగర్వాల్, ప్రకాష్ రాజ్, కమలిని ముఖర్జీ, జయసుధ, ఎం యస్. నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసానిక్రిష్ణమురళి, కాదంబరి కిరణ్, కాశీ విశ్వనాద్, సమీర్, కారుమంచిరఘు, గిరిధర్, ప్రగతి, సత్య కృష్ణన్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, కెమెరా : సమీర్ రెడ్డి, సంగీతం: యువన్ శంకర్ రాజా, ఆర్ట్: అశోక్ కుమార్, ఎడిటింగ్: నవీన్, ఫైట్స్: పీటర్ హైన్స్,రామ్ లక్ష్మణ్, సమర్పణ: శివబాబు బండ్ల, బ్యానర్: పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్.
కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే చిత్రమిది. ప్రతీ సన్నివేశంలోనూ తెలుగుదనం ఉట్టిపడుతుంది. రామ్‌చరణ్ విదేశాల్లో పుట్టి పెరిగిన యువకుడి పాత్రలో కనిపిస్తాడు. తనవారికోసం సొంతూరికి వచ్చిన ఓ ఎన్నారై యువకుడు ఎలాంటి సందడిని సృష్టించాడన్నది ఇందులో ఆసక్తికరం. చరణ్ తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుంది.


Click it and Unblock the Notifications











