సైకిల్ లుక్ పై... రామ్ చరణ్ ఫ్యాన్స్ అసంతృప్తి (ఫోటోస్)
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా క్రిష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రానికి సంబంధించిన తాజాగా విడుదలైన పోస్టర్లపై రామ్ చరణ్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ పోస్టర్లలో రామ్ చరణ్ ను సైకిల్ పై చూపెట్టడం, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ లను బైకులపై చూపెట్టడం చెర్రీ స్థాయికి తగినట్లుగా లేదని అంటున్నారు.
కథానుగుణంగా సినిమాలో అలా ఉండి ఉండవచ్చేమోగానీ.....పోస్టర్లలో ఆ లుక్ రామ్ చరణ్ రేంజిలో లేదని అంటున్నారు. పల్లె టూరి వాతావరణంకాబట్టి సైకిల్ కాకుండా ఎడ్ల బండిపై చూపెట్టినా బాగుండేదని అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా రామ్ చరణ్ సైకిల్ లుక్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు, సినిమాకు సంబంధించిన వివరాలు...

రామ్ చరణ్ సైకిల్ లుక్
ఇక్కడ ఫోటోలో చూడండి....ప్రకాష్ ఫారిన్ బైక్ పై, శ్రీకాంత్ బుల్లెట్ బైకుపై, రామ్ చరణ్ సైకిల్ పై...

గోవిందుడు అందరి వాడేలే...
రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కాజల్ హీరోయిన్. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ఇతర ముఖ్య పాత్రధారులు.

ప్రకాష్ రాజ్, శ్రీకాంత్
భారీ తారాగణంతో కృష్ణ వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఈచిత్రంలో రామ్ చరణ్ తాత పాత్రలో నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్‌కు జోడీగా జయసుధ నటిస్తోంది. మరో నటుడు శ్రీకాంత్ రామ్ చరణ్ బాబాయ్ పాత్రలో నటిస్తుండగా అతనికి జోడీగా కమలినీ ముఖర్జీ నటిస్తున్నపారు.

గోవిందుడు అందరివాడేలే చిత్రం రిలీజ్ డేట్
అక్టోబర్ 1న విడుదలవుతోంది. కెరీర్లో తొలి దసరా రిలీజ్ కావడంతో రామ్ చరణ్ ఎగ్జైట్మెంటుతో ఉన్నారు. ఈ చిత్రంలో చరణ్ పల్లెటూరికి వచ్చే ఎన్నారై పాత్రలో నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టెనర్ ఇప్పటి వరకు మాస్, యాక్షన్ సినిమాలతో అలరించిన రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో ఫ్యామిలీ హీరోగా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.


Click it and Unblock the Notifications











