ప్రత్యేకత లేదు: అదే రోజు ‘గోవిందుడు అందరి వాడేలే’!
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గోవిందుడు అందరి వాడేలే'. కాజల్ హీరోయిన్. 'గోవిందుడు అందరివాడేలే' చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ టీజర్ ని కృష్ణ వంశీ పుట్టిన రోజు(జులై 28) సందర్భంగా ఈ రోజు విడుదల చేద్దామనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీలుకాలేదు.
తాజాగా ఈ చిత్రం టీజర్ ఆగస్టు 7న విడుదల చేయాలని నిర్ణయించినట్లు బండ్ల గణేష్ తెలిపారు. పుట్టినరోజు లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి టీజర్లు విడుదల చేయడం గత కొన్నాళ్లుగా టాలీవుడ్లో కొనసాగుతున్న ఆనవాయితీ. అయితే ఎలాంటి ప్రత్యేక లేని రోజు 'గోవిందుడు అందరి వాడేలే' టీజర్ విడుదల చేయాలని నిర్ణయించడం గమనార్హం.

భారీ తారాగణంతో కృష్ణ వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఈచిత్రంలో రామ్ చరణ్ తాత పాత్రలో నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్‌కు జోడీగా జయసుధ నటిస్తోంది. మరో నటుడు శ్రీకాంత్ రామ్ చరణ్ బాబాయ్ పాత్రలో నటిస్తుండగా అతనికి జోడీగా కమలినీ ముఖర్జీ నటిస్తున్నపారు.
గోవిందుడు అందరివాడేలే చిత్రం రిలీజ్ డేట్ కూడా ఖరారైంది. అక్టోబర్ 1న విడుదలవుతోంది. కెరీర్లో తొలి దసరా రిలీజ్ కావడంతో రామ్ చరణ్ ఎగ్జైట్మెంటుతో ఉన్నారు. ఈ చిత్రంలో చరణ్ పల్లెటూరికి వచ్చే ఎన్నారై పాత్రలో నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టెనర్ ఇప్పటి వరకు మాస్, యాక్షన్ సినిమాలతో అలరించిన రామ్ చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో ఫ్యామిలీ హీరోగా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.


Click it and Unblock the Notifications











