తొలి ‘దసరా’ సమరం అంటూ రామ్ చరణ్ ఎగ్జైట్మెంట్
హైదరాబాద్: మోగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో ఇప్పటి వరకు అరడజను సినిమాల్లో నటించారు. అయితే అందులో ఏ సినిమా కూడా దసరా సీజన్లో విడుదల కాలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం మాత్రం తొలిసారిగా దాసరా సీజన్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ విషయాన్ని రామ్ చరణ్ తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా వెల్లడించారు. 'గోవిందుడు అందరివాడేలే చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. అక్టోబర్ 1న విడుదలవుతోంది. కెరీర్లో తొలి దసరా రిలీజ్. సూపర్ ఎగ్జైటెండ్' అంటూ రామ్ చరణ్ వ్యాఖ్యానించారు.
'గోవిందుడు అందరివాడేలే' చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. స్లైడ్ షోలో రామ్ చరణ్ పోస్టు చేసిన ఫోటోలు, వివరాలు..

రామ్ చరణ్ తేజ్
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో చరణ్ పల్లెటూరికి వచ్చే ఎన్నారై పాత్రలో నటిస్తున్నారు.

కాజల్ హీరోయిన్
ఈ చిత్రంలో రామ్ చరణ్ తేజ్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంతకు ముందు ఈ ఇద్దరు ‘మగధీర', ‘నాయక్' చిత్రాల్లో కలిసి నటించారు.

ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్
ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, జయసుద, శ్రీకాంత్ నటిస్తున్నారు. తొలుత రాజ్ కిరణ్‌ను ఎంపిక చేసినప్పటికీ...తర్వాత అతని స్థానంలో ప్రకాష్ రాజ్‌ను తీసుకుని ఆయనకు సంబంధించిన సీన్లు రీ షూట్ చేసారు.

ఫ్యామిలీ ఎంటర్టెనర్
ఇప్పటి వరకు మాస్, యాక్షన్ సినిమాలతో అలరించిన రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో ఫ్యామిలీ హీరోగా కనిపించనున్నాడు.


Click it and Unblock the Notifications











