'గోవిందుడు అందరివాడేలే' లెంగ్త్ ఎంతో తెలుసా?

By Srikanya

హైదరాబాద్ : 'గోవిందుడు..' కృష్ణవంశీ కెరీర్‌ని మళ్లీ హైవే ఎక్కిస్తుందని ఆయన అభిమానులంతా నమ్మకంగా ఎదురుచూస్తున్నారు. ప్రచార చిత్రాలు చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తోంది. ఆ కష్టం ఫలించి.. 'గోవిందుడు..' కాసుల వర్షం కురిపిస్తే అంతకంటే కావల్సిందేముంది? అంటున్నారు మెగాభిమానులు. అక్టోబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రం రన్ టైమ్ ని 2 గంటల 29 నిముషాలుగా లాక్ చేసారు.

లండన్‌లో పుట్టి పెరిగి అక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు అలవాటు పడిన అభిరామ్ అనే యువకుడు తన మూలాల్ని వెతుక్కుంటూ ఓ అందమైన తెలుగు పల్లెకు వస్తాడు. అక్కడ అతను సరికొత్త జీవితాన్ని దర్శిస్తాడు. పల్లె అప్యాయతలు, అనుబంధాలకు ముగ్ధుడవుతాడు. అభిరామ్ అందరివాడనిపించుకుంటాడు. ఈ క్రమంలో జరిగే భావోద్వేగభరిత సంఘటనల సమాహారమే గోవిందుడు అందరివాడేలే చిత్ర ఇతివృత్తం అన్నారు కృష్ణవంశీ.

 Govindudu Andarivadele ’s run time locked

ఆయన దర్శకత్వంలో రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం లండన్‌లోని సుందరమైన లొకేషన్లలో పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. అక్టోబర్ 1న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ కుటుంబ బంధాలకు దర్పణంలా ఈ సినిమా వుంటుంది. రామ్‌చరణ్ పాత్ర చిత్రణలో భిన్న పార్శాలుంటాయి.

మా బ్యానర్‌కు మరింత గుర్తింపునిచ్చే చిత్రమవుతుంది అన్నారు. ప్రకాష్‌రాజ్, జయసుధ, ఎం.ఎస్.నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఆర్ట్: అశోక్‌కుమార్, ఎడిటింగ్: నవీన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, రామ్‌లక్ష్మణ్, రచన: పరుచూరి బ్రదర్స్, దర్శకత్వం: కృష్ణవంశీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X