‘గోవిందుడు అందరి వాడేలే’ ఆడియో సాంగ్స్
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' కధానాయకునిగా క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో అగ్రనిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' ఆడియో వేడుక ఈ రోజు(సెప్టెంబర్ 15) సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరుగబోతోంది. సినిమాను అక్టోబర్ 1 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియోను విడుదల చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదిత్య మ్యూజిక్ వారు పాటలను విపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? పాటలు విని ఎలా ఉన్నాయో కామెంట్ బాక్సులో మీ అభిప్రాయాలు విసరండి.
శ్రీకాంత్, కాజల్అగర్వాల్, ప్రకాష్ రాజ్, కమలిని ముఖర్జీ, జయసుధ, ఎం యస్. నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసానిక్రిష్ణమురళి, కాదంబరి కిరణ్, కాశీ విశ్వనాద్, సమీర్, కారుమంచిరఘు, గిరిధర్, ప్రగతి, సత్య కృష్ణన్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, కెమెరా : సమీర్ రెడ్డి, సంగీతం: యువన్ శంకర్ రాజా, ఆర్ట్: అశోక్ కుమార్, ఎడిటింగ్: నవీన్, ఫైట్స్: పీటర్ హైన్స్,రామ్ లక్ష్మణ్, సమర్పణ: శివబాబు బండ్ల, బ్యానర్: పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్.


Click it and Unblock the Notifications












