గణేష్‌ని భయ పెట్టారు, రామ్ చరణ్ అండగా నిలిచారు!

By Bojja Kumar

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరి వాడేలే' సక్సెక్స్ మీట్ శుక్రవారం జరిగింది. ఔటాఫ్ స్టేషన్లో ఉండటం వల్ల రామ్ చరణ్ ఈ ప్రెస్ మీట్‌కు రాలేక పోయారు. దర్శకుడు కృష్ణ వంశీ, కాజల్, కోట శ్రీనివాసరావు, నిర్మాత బండ్ల గణేష్, పరుచూరి బ్రదర్స్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణ వంశీ మాట్లాడుతూ దర్శకుడిగా నేను ఇంత పెద్ద హిట్ చూసి చాలా రోజులవుతోంది. మాస్..యాక్షన్...లవ్‌స్టోరీలంటూ విచిత్రమైన ట్రెండు సాగుతున్న సమయంలో...దర్శకుడిగా నాకు హిట్లు లేని సందర్భంలో నేను చెప్పిన కథ నమ్మి చివరి క్షణం వరకు నాకు సపోర్ట్‌గా రామ్‌చరణ్ నిలబడటం గొప్ప విషయం అన్నారు.

Govindudu Andarivadele Success Meet

గణేష్ నాతో సినిమా చేస్తున్నాడని తెలిసి అతన్ని ఐదు నెలలు ఎవరెవరు ఎలా భయపెట్టారో నాకు తెలుసు. అయినా వాటన్నింటినీ చిరునవ్వుతో స్వీకరించి వాటి ప్రభావం సినిమాపై ఎక్కడా పడకుండా గణేష్ చక్కటి సహకారం అందించాడు. చరణ్ తరువాత అతనే ఈ సినిమాకు పెద్ద హీరోని అన్నారు.

ఇలాంటి సినిమాకు పరుచూరి బ్రదర్స్ సహకారం అవసరమని సలహాఇచ్చిన అన్నయ్య చిరంజీవికి కృతజ్ఞతలు. ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్ నన్ను నమ్మి నటించారు. కోట శ్రీనివాసరావు భారతదేశం గర్వించదగ్గ నటుడు. కొన్ని పాత్రలు ఆయన మాత్రమే చేయగలని కృష్ణ వంశీ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X