చిన్నపిల్లలకు చెందిన టెలివిజన్ కార్టూన్ సీరియల్ 'షిన్ చాన్'పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సీరియల్‌లో ఇటీవల కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ప్రసారం అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఆనంద్ శర్మ తెలిపారు. ఈ సీరియల్ 'హంగామా' అనే టెలివిజన్ ఛానల్‌లో ప్రసారం అవుతూ విపరీతమైన ఆదరణను పొందుతోంది. ఈ సందర్భంగా ఆర్థిక నిపుణుల సదస్సులో శర్మ మాట్లాడుతూ.. సమాజాన్ని పక్కదోవ పట్టించే ఎలాంటి హింసాత్మకమైన కార్యక్రమాలనైనా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని పేర్కొన్నారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ సీరియల్ ఇంకా ప్రసారం అవుతోంది కదా..? అన్న ప్రశ్నకు సమాధానంగా.. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ఆదేశించామన్నారు.అలాగే మరికొన్ని ఇలాంటి సీరియల్స్ ని కూడా పరిశీలుస్తున్నారని తెలుస్తోంది. ఇక మన తెలుగు సీరియల్స్ కూడా వారు చూస్తే...ఏదొ ఒక నిర్ణయం తప్పనిసరిగా తీసుకుంటారని అంతా ఆసిస్తున్నారు.ఆ రోజులు ఎప్పుడొస్తాయో...