ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఆర్య-2 చేస్తున్న అల్లు అర్జున్ తర్వాత మూడు సినిమాలు కూడా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఆర్య-2 అనంతరం గుణశేఖర్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ళనుంది. ఆ తర్వాత ఘర్షణ ఫేమ్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేస్తారు. ఈ రెండు పూర్తయ్యాక పూరీ జగన్నాధ్ ప్రాజెక్టు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం గుణశేఖర్ ప్రాజెక్టు కోసం సెట్స్ వేస్తున్నారు. వచ్చే నెల (మార్చి) నుండి ఈ సినిమా ప్రారంభమవుతుంది. అలాగే గౌతమ్ మీనన్ సినిమా గుణశేఖర్ చిత్రం అనంతరం ప్రారంభమవుతుంది. ఈ లోగా గౌతమ్ మీనన్...మహేష్ బాబు తో సినిమా పూర్తి చేసి రెడీగా ఉంటారు. ఇక పూరీ ప్రాజెక్టు...ప్రభాస్,పవన్ కళ్యాణ్ ల సినిమాల అనంతరం ఉంటుంది. వీటిన్నటి స్టోరీ లైన్స్ ఓకే చేసినట్లు సమాచారం. ఈ లోగా ఆ దర్శకులు స్క్రిప్టు రెడీ చేసుకుని, తమ చేతిలో ఉన్న ప్రాజెక్టులు ఫినిష్ చేసుకుంటారు.