మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించనున్న గౌతమి
నవంబర్ 7 కమల్ హాసన్ జన్మదినం. ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కమల్ హాసన్ అభిమానులు పెద్దయెత్తున రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా కమల్ కూడా రక్తదానం చేస్తారు. ఈ సంవత్సరం కమల్ జన్మదినోత్సవం రక్తదాన శిబిరం ప్రారంభోత్సవంతో మొదలవుతుంది. కమల్ ఫ్యాన్ క్లబ్ నార్పని ఇయక్కమ్ రక్తదాన శిబిరానికి సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉంది. 15000 మంది అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొననున్నారు. అయితే రక్తదాన శిబిరం ఒక్కరోజు కాకుండా నవంబర్ నెలంతా తమిళనాడు రాష్ట్రమంతా కొనసాగుతుంది.
ఈ మారు ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నవంబర్ 4న ప్రారంభం అవుతుంది. చెన్నయ్ లోని పులియంతోప్ హిందూ మిడిల్ స్కూల్ లో ప్రారంభమయ్యే ఈ రక్తదాన శిబిరాన్ని కమల్ స్నేహితురాలు గౌతమి ప్రారంభించనున్నది. ఈ మారు కమల్ జన్మదినోత్సవాలలో గౌతమి స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నది.


Click it and Unblock the Notifications











