కమల్ 'ఈనాడు'లో గౌతమి!?
కమల్ హాసన్,వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన ఈనాడు చిత్రంలో గౌతమి పాత్ర ఉంది. ఎక్కడా మాకు కనపడలేదే అని ఆశ్చర్యపోకండి. ఆమె రూపం తెరమీద కనపడదు. కానీ ఆమె వాయిస్ వినిపిస్తుంది. చిత్రంలో కమల్ కి ఇంటినుంచి ఫోన్ వస్తుంది. అతని బార్య మాట్లాడుతుంది. ఆ షాట్ లో వాయిస్ మాత్రమే వినపడుతుంది. కానీ మనిషి కనపడదు. ఆ వాయిస్ గౌతమిది. పట్టుపట్టి మరీ కమల్ ఈ సన్నివేశానికి ఆమెను ఒప్పించారుట. అయితే ఆమె వాయిస్ విని చాలా కాలం కావటం తో ఆమె అభిమానులకు తప్పమిగతా వారు గుర్తు పట్టటం కష్టమే. ఇక కొంతకాలంగా కమల్ హాసన్,గౌతమి లివింగ్ టుగెదర్ అంటూ కలిసి ఉంటున్నారనే సంగతి తెలిసిందే.అలాగే ఆమె కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ కి సంభందించిన పనుల్లో కూడా బిజీగా ఉంటోంది.ఇక ఈనాడు చిత్రం పెద్దగా వర్కవుట్ కాలేదనే చెప్పాలి. ఓపినింగ్స్ బాగున్నా కొంతమంది డాక్యుమెంటిరిలాగ ఉందనంటం,ఇంగ్లీష్ డైలాగులు ఎక్కువ అవటం మాస్ వర్గానికి నచ్చకపోవటం మైనస్ లుగా చెప్తున్నారు. పోనీ మల్టీఫ్లెక్స్ ఆడియన్స్ కి పడుతుందా అంటే వారు ఇప్పటికే ఎ వెడ్నస్ డే చిత్రం చూసేసినవారే.


Click it and Unblock the Notifications











