»   » ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ గురించి..: ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్, రాజమౌళి, వర్మ,నితిన్, తమన్నా,రకుల్ ఇలా మొత్త

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ గురించి..: ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్, రాజమౌళి, వర్మ,నితిన్, తమన్నా,రకుల్ ఇలా మొత్త

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలయ్య అబిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' ట్రైలర్ రిలీజయ్యి...దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో 100 థియేటర్లలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన ఈ ట్రైలర్ ని బాలయ్య అభిమానులు మాత్రమే కాక సిని ప్రేమికులు అంతా చూసి అభినందించారు. సిని సెలబ్రెటీలు సైతం ఈ ట్రైలర్ ని మెచ్చుకుంటూ ట్వీట్స్ చేసారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి ప్రశంసలు వర్షం కురిస్తోంది.

ఈ ట్రైలర్‌కు పలువురు రాజకీయ, చిత్ర ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. నందమూరి హీరోలు ఎన్టీయార్‌, కల్యాణ్‌రామ్‌ కూడా తమ బాబాయ్‌ వందో సినిమా ట్రైలర్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు.


బాబాయ్‌ చక్కగా నటించారని.. బాలకృష్ణను మునుపెన్నడూ చూడని విధంగా చూపించినందుకు దర్శకుడు క్రిష్‌ను ప్రశంసిస్తూ.. ట్రైలర్‌ లింక్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. కొంతకాలంగా బాబాయ్-అబ్బాయ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ట్రైలర్‌పై ఎన్టీఆర్ స్పందించడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.


అద్బుతం..

తన బాబాయ్‌ నందమూరి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం ట్రైలర్‌ను ఉద్దేశించి హీరో ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం ట్రైలర్‌ అద్భుతంగా ఉందన్నారు.


కళ్యాణ్ రామ్ ఇలా..

దేశం మీసం తిప్పుదాం.. ఎక్సట్రార్డినరీ ట్రైలర్ అంటూ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశాడు. తాజాగా విడుదలైన గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అంటూ అభిమానులు అంచనా వేస్తున్నారు.


మైండ్ బ్లోయింగ్

ఎనిమిది నెలల్లో మీరు సాధించింది మైండ్ బ్లోయింగ్ గా ఉంది. హ్యాట్యాఫ్ అంటూ రాజమౌళి ట్వీట్ చేసారు.


సూపర్బ్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నితిన్ ఈ చిత్రం ట్రైలర్ చూసిన వెంటనే సూపర్బ్ అంటూ ఇలా ట్వీట్ చేసి తన ఆనందం వ్యక్తం చేసారు.


మెచ్చుకుంటూ...

గబ్బర్ సింగ్ సూపర్ హిట్ చిత్రం నిర్మించిన తెలుగు సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ ..ఈ చిత్రం ట్రైలర్ చూసి ఇలా ట్విట్టర్ లో స్పందించారు.


ఎపిక్..

దర్శకుడు క్రిష్ తొలి చిత్రం గమ్యంలో చేసిన అల్లరి నరేష్..ఈ చిత్రం ట్రైలర్ చూసి ఎపిక్ అంటూ ఈ క్రింద విధంగా క్రిష్ ని, బాలకృష్ణని మెచ్చుకున్నారు.


ఆసమ్

ఈ చిత్రం ట్రైలర్ చూసిన తమన్నా ...ఆసమ్ అంటూ మెచ్చుకుంటూ ట్వీట్ చేసింది. ఆమె చేసిన ట్వీట్ ని మీరు ఈ క్రింద చూడవచ్చు.


బాహుబలి ఇప్పుడు ఇది..

బాహుబలి, గౌతమి పుత్ర శాతకర్ణి ఈ రెండు చిత్రాలు తెలుగు ఇండస్ట్రీని హైట్స్ కు తీసుకువెళ్లాయంటూ నిఖిల్ ఈ క్రింద విధంగా ట్వీట్ చేసారు.


విజువల్ ట్రీట్

బాలయ్య అల్లుడు నారా లోకేష్ తన మామయ్య తాజా చిత్రం ట్రైలర్ ని చూసి ఈ క్రింద విధంగా స్పందించారు.


ట్రేడ్ ఎనాలిసిస్ట్

ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ ఎనాలసిస్ట్ తరణ్ ఆదర్శ్...ఈ చిత్రం ట్రైలర్ ని చూసి ఈ క్రింద విధంగా ట్వీట్ చేసారు.


తెలుగు సినిమా నెక్స్ట్ లెవిల్ కి

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రం ట్రైలర్ చూసి వెంటనే తన దైన శైలిలో స్పందించారు. తెలుగు సినిమా మరోసారి నెక్ట్స్ లెవిల్ కు వెళ్లిందని ప్రశంసించారు.


కెమెరామెన్ సెంధిల్

ప్రముఖ కెమెరామెన్..సెంధిల్ ఈ చిత్రం ట్రైలర్ చూసి ఈ క్రింది విధంగా స్పందించారు. ఆసమ్, గ్రేట్ ఎఫర్ట్ అంటూ మెచ్చుకున్నారు.


లైన్ ఈజ్ బ్యాక్

మన ప్రాంతం పవర్, ప్రైడ్ అంటూ ఈ చిత్రం ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ మెచ్చుకుంటూ ట్వీట్ చేసారు. లయిన్ ఈజ్ బ్యాక్ ,హ్యాట్యాఫ్ అన్నారు.


టీంకు శుభాకాంక్షలు

ప్రముఖ దర్శకుడు దేవకట్టా ఈ చిత్రం ట్రైలర్ ని చూసి ఇన్సఫైరింగ్ గా ఉందని మెచ్చుకున్నారు. టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలియచేసారు.


రాక్స్...

గతంలో దర్శకుడు క్రిష్ తో కృష్ణ వందే జగద్గురుమ్, బాలయ్యతో పలు చిత్రాలు చేసిన నయనతార ఈ చిత్రం ట్రైలర్ చూసి ఈ క్రింద విధంగా స్పందించారు.


ఎమేజింగ్

ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రం ట్రైలర్ ని చూసి ఈ క్రింద విధంగా ట్వీట్ చేసారు. ఎమేజింగ్ వర్క్ అంటూ మెచ్చుకున్నారు.


బాహుబలి నిర్మాత

క్రిష్ తో గతంలో వేదం చిత్రం నిర్మించిన...బాహుబలిల నిర్మాత శోభు యార్లగడ్డ..ఈ చిత్రం ట్రైలర్ ని చూసి ఈ క్రింద విధంగా ట్వీట్ చేసారు.


రకుల్ ప్రీతి సింగ్

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ ఈ చిత్రం ట్రైలర్ ని చూసి ఈ క్రింద విధంగా ట్వీట్ చేసింది. బ్యూటీఫుల్ అంటూ శ్రియను మెచ్చుకుంది.


అవుట్ స్టాండింగ్

కళ్యాణ్ రామ్ తో పటాస్ వంటి హిట్ ఇచ్చి సుప్రీమ్ అంటూ దూసుకుపోతున్న దర్శకుడు అనీల్ రావిపూడి ఈ చిత్రం ట్రైలర్ చూసి ఈ క్రింద విధంగా స్పందించారు.


నిర్మాత రామ్ ఆచంట

రీసెంట్ గా తమ బ్యానర్ పై హైపర్ చిత్రం నిర్మించిన నిర్మాత రామ్ ఆచంట... ఈ చిత్రం ట్రైలర్ ని చూసి మెచ్చుకుంటూ ట్వీట్ చేసారు.


English summary
NTR has also tweeted praising the trailer, director Krish and Balayya. “Phenomenal trailer of #GPS.Babai at his best.Kudos DirKrish for showcasing NBK like never before,” tweeted Tarak.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu