twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్కతో ఎఫైర్?.. ఆ కోరిక బయటపెట్టిన ప్రభాస్, ఒకప్పుడు బస్సుల్లోనూ.., సాహో తర్వాత అదే!

    |

    'కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్..' ప్రభాస్ పాపులర్ డైలాగుల్లో ఇదీ ఒకటి. కానీ కొన్ని విషయాలపై స్వయంగా ప్రబాసే వివరణ ఇచ్చినా.. నమ్మడం లేదు సరికదా!.. గాసిప్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అందులో అనుష్కతో ఎఫైర్ ప్రధానమైనది. ప్రముఖ మ్యాగజైన్‌ జీక్యూ ఇండియాలో ఇలాంటి చాలా విషయాలపై ప్రభాస్ స్పందించారు.. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

    Recommended Video

    Prabhas Clears Rumours Of His Link Up with Anushka పెళ్లి వార్తల పై ప్రభాస్ స్పందన

    ఇది పక్కా అయితే.. ప్రభాస్ మరో ప్రభంజనమే?, సినిమా ఎవరితోనో తెలుసా?..ఇది పక్కా అయితే.. ప్రభాస్ మరో ప్రభంజనమే?, సినిమా ఎవరితోనో తెలుసా?..

    అనుష్కతో ఎఫైర్?..:

    అనుష్కతో ఎఫైర్?..:

    ఒకే హీరోయిన్‌తో అనేక సినిమాల్లో చేసినప్పుడు.. ఇద్దరి మధ్య ఎఫైర్ గురించి వార్తలు రావడం సహజమే. అనుష్కకు నాకు కూడా అదే జరిగింది. కానీ నేను అనుష్క ఇప్పటికీ ఎప్పటికీ మంచి స్నేహితులం మాత్రమే.

    పొగరుగా ప్రవర్తిస్తే..

    పొగరుగా ప్రవర్తిస్తే..

    బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ ఫేమ్ వచ్చింది కదా అని.. విజయాన్ని తలకెక్కించుకోను. ఇండస్ట్రీలో నాకు ఎంతోమంది మంచి స్నేహితులు ఉన్నారు. ఎంత మంచి స్నేహితులంటే.. నేను పొగరుగా ప్రవర్తిస్తే నా తలపై మొట్టికాయలు పడుతాయంతే.

    సాహో తర్వాత.. హిందీలో:

    నేను హిందీ సినిమాల్లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చాలా కాలంగా నేను హైదరాబాద్ లోనే నివసిస్తున్నా. ఇక్కడ 60 శాతం మంది హిందీలోనే మాట్లాడతారు. నేనూ హిందీ సినిమాలు బాగా చూస్తాను. చెప్పాలంటే మూడేళ్ల క్రితమే ఓ హిందీ సినిమాకు ఓకే చేశాను. లవ్ స్టోరీతో ఆ చిత్రం రాబోతోంది. 'సాహో' తర్వాత

    నిర్మొహమాటంగా..:

    నిర్మొహమాటంగా..:

    నాకు బాలీవుడ్‌లో కరణ్‌ జోహార్‌ మంచి స్నేహితుడు. నాకేం కావాలన్నా అతన్నే నిర్మొహమాటంగా అడుగుతాను. 'బాహుబలి' సినిమా సమయంలో చాలా హెల్ప్ చేశారు.

     'సూపర్ స్టార్' కోరిక బయటపెట్టేశాడు..:

    'సూపర్ స్టార్' కోరిక బయటపెట్టేశాడు..:

    ఏదైనా ఒక పాత్రతో ఓ హీరోకు మంచి గుర్తింపు వచ్చిందంటే.. తన తర్వాతి సినిమాల్లోనూ అలాంటి పాత్రనే కోరుకుంటారు. వేరే పాత్రలు చేస్తే ఫ్లాప్ అవుతుందనుకుంటారు. కానీ అందులో లాజిక్‌ లేదు. స్క్రిప్ట్ బాగాలేకపోతే సినిమా ఆడదు.

    స్క్రిప్ట్ సరిగా లేక సినిమా ఆడకపోయినా.. హీరోనే సరిగా నటించలేదంటారు. అది సరికాదు. బాహుబలి తర్వాత ప్రభాస్ సూపర్ స్టార్ అయిపోయాడంటున్నారు. కానీ నేను మాత్రం ఏదో ఒకరోజు సూపర్ స్టార్ అవాలని కోరుకుంటున్నాను.

    ఒకప్పుడు బస్సులో వెళ్లిన రోజులు..:

    ఒకప్పుడు బస్సులో వెళ్లిన రోజులు..:

    స్టార్‌ కిడ్స్‌కి సులువుగా అవకాశాలు దొరుకుతాయన్న ప్రచారం ఉంది. వారికి ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు అని చెబుతారు. మా నాన్న సక్సెస్ ఫుల్ నిర్మాత.. అయినా నా కాలేజీ రోజుల్లో నేను బస్సులో వెళ్లేవాడిని. అప్పుడు నన్ను చూసి కొంతమంది 'అతను పెద్దింటి కుటుంబం నుంచి వచ్చాడు' అంటుండేవారు. అలాంటి సంఘటనలే జీవితంలో నన్ను కష్టపడేలా చేశాయి.-ప్రభాస్

    English summary
    Life has been good for the star since the wild success of the Baahubali franchise, the priciest Indian film ever made. The thunderous two-part epic grossed over ₹1,500 crore in less than 50 days,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X