నకిలీలకు చెక్:‘టెంపర్’ వేడుకకు కట్టుదిట్టమైన భద్రత
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటిస్తున్న ‘టెంపర్' ఆడియో వేడుక ఈ రోజు సాయంత్రం శిల్పకళా వేదికలో గ్రాండ్‌గా జరుగబోతోంది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కాగా ఆడియో వేడుకకు భారీగా అభిమానులు తరలి రానున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేసారు.
గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని...ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా నకిలీ పాస్‌లకు చెక్ పెట్టేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాసులను చెక్ చేసి లోనికి అనుమతించబోతున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఇదే అత్యంత గ్రాండ్‌గా జరిగే ఆడియో వేడుక అని నిర్వాహకులు చెబుతున్నారు. శ్రేయాస్ మీడియా వారు ఈ ఈవెంటును నిర్వహిస్తున్నారు. ఇది వారి 400వ ఈవెంటు కావడంతో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
డియో సీడీ మాత్రం ఇప్పటికే ఆవిష్కరించేసారు. సోమవారం రథ సప్తమి కావడంతో ఈ పని చేసారు. దీని గురించి నిర్మాత బండ్ల గణేష్ వెల్లడిస్తూ...‘రథసప్తమి. చాలా మంచి రోజు. అందుకే టెంపుల్ లో ఆడియో సీడీ రిలీజ్ చేసాం. ఆడియో రిలీజ్ వేడుక మాత్రం ఈ రోజు (జనవరి 28న) జరుగుతుంది. మమ్మల్ని ఆశీర్వదించండి' అంటూ ట్వీట్ చేసారు.
ఈ ఆడియోకి నందమూరి బాలకృష్ణ వచ్చే అవకాశం ఉందని ఫిలింనగర్ సమాచారం. దీంతో నందమూరి అభిమానుల్లో సందడి వాతావరణం ఏర్పడుతుంది. అయితే బాబాయ్-అబ్బాయ్‌ని ఒకే వేదికపై చూడాలనేకునే అభిమానులు ఆరోజు కోసం వేచి చూస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. సినిమాకు మ్యూజిక్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఫిబ్రవరి 12 లేదా 13న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫుల్‌లెంగ్త్ కమర్షియల్, మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.
ఈ చిత్రంలో తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ మాజీ భార్య, నటి సోనియా అగర్వాల్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ భామ తెలుగులో వచ్చిన ‘7/జి బృందావన్ కాలనీ' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సోనియా అగర్వాల్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. సినిమా చివర్లో ఓ 20 నిమిషాల పాటు ఆమె స్పెషల్ అప్పియరెన్స్ ఉంటుందని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











