twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏం టేస్టు గురూ..? బూతు సినిమాకు కాసుల వర్షం!

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్లో తాజాగా రిలీజై 'గ్రాండ్ మస్తీ' చిత్రానికి ఎవరూ ఊహించని విధంగా కాసుల వర్షం కురుస్తోంది. ఇందులో ఆశ్చర్య పడాల్సిన విషయం ఏమిటంటే ఇదో పరమ బూతు డబుల్ మీనింగ్ డైలాగులతో నిండి ఉన్న సినిమా కావడమే. సెక్సు గురించి, సెక్స్ సంబంధమైన కామెడీ గురించి బహిరంగంగా మాట్లాడటానికే ఇష్టపడని భారతీయ సమాజం ఈ ఎక్స్ రేటెడ్ సినిమాకు కలెక్షన్ల పంట పండిస్తోంది.

    ఇటీవల విడుదలైన కహానీ, బర్పీ, 3 ఇడియట్స్, భాగ్ మిల్ఖా భాగ్ లాంటి అద్భుతమైన చిత్రాలకు భారతీయ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మన ప్రేక్షకుల టేస్టు చాలా గొప్పది అని అంతా సంబర పడ్డాం. అయితే తాజాగా విడుదలైన 'గ్రాండ్ మస్తీ' లాంటి బూతు చిత్రానికి కూడా కలెక్షన్లు భారీగా రావడం చూస్తే....మన ఆడియన్స్‌కు ఇలాంటి టేస్టును కూడా ఆస్వాదించే తత్వం ఉందని స్పష్టం అయింది.

    అయితే 'గ్రాండ్ మస్తీ' చిత్రానికి ఇంత ఆదరణ దక్కడానికి కారణం....ఇలాంటి అడల్ట్ ఎంటర్టెన్మెంట్ చిత్రం ఇది వరకెప్పుడూ రాక పోవడం, సినిమా మొత్తం బూతు ఎంటర్టెన్మెంట్‌తో నవ్వుల వర్షం కురిపించడమే అని అంటున్నారు విశ్లేషకులు. యూత్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఒక్క విషయం మాత్రం అర్థం అవుతుంది. ఎంటర్టెన్మెంట్ ఉంటే ఎలాంటి సినిమానైనా మనోళ్లు ఆదరిస్తారన్నమాట!

    సినిమాలో ఎంటర్టెన్మెంట్ ఉన్నమాట వాస్తవమే. అయితే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. ఇది పెద్దలకు మాత్రమే పరిమితమైన సినిమా. ఈ సినిమాను స్నేహితులతో, లేక జీవిత భాగస్వామితోనో, లవర్‌తోనో కలిసి చూస్తే ఫర్వాలేదు. ఎంజాయ్ చేయొచ్చు. కానీ...ఇతర కుటుంబ సభ్యులతో చూస్తే మాత్రం ఇబ్బంది పడకతప్పుదు!

    ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రం ఇంగ్లీష్ అడల్ట్ కామెడీ చిత్రాలను ఇన్స్‌స్పిరేషన్‌గా తెరకెక్కించినట్లు స్పష్టం అవుతోంది. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, రితేష్ దేష్ ముఖ్, అఫ్తాబ్ శివదాసాని, మంజరి, కరిష్మా తన్నా, మరియమ్ జకారియా, బ్రూనా అబ్దుల్లా, కైనత్ అరోరా, ప్రదీప్ రావత్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సినిమా కథ విషయానికొస్తే....ముగ్గురు స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుంది. ఇంట్లో భార్యలతో సంసార సుఖం లేని వారు.....ఎలాంటి అడ్డదారులు తొక్కారు, ఇబ్బందుల్లో ఇరుక్కుని ఎలా బయట పడ్డారు అనేది స్టోరీ. సినిమాలో అసలు సెన్సార్ కట్స్ అనేవి లేనే లేవు.

    మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈ సినిమా గురించి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కూడా చర్చ బాగానే సాగుతోంది. పలువురు సినిమా గురించి ట్వీట్ చేస్తున్నారు. అవేమిటో ఓసారి చూద్దాం....

    పంకజ్ ట్వీట్

    పంకజ్ ట్వీట్

    డబ్బులు వసూలు చేసే సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం. కామెడీ టైమింగుతో సినిమాను అద్భుతంగా తీసారు. పైసా వసూల్ మూవీ అంటూ ట్వీట్ చేసారు

    ఖుష్భూ..

    ఖుష్భూ..

    నటి ఖుష్బూ రితేష్ దేశ్ ముఖ్, జెనీలియాలకు ట్వీట్ చేస్తూ....‘సినిమా నిజంగానే గ్రాండ్ మస్తీ. సూపర్‌గా ఉంది. సినిమా గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. సూపర్ అంతే' అని వ్యాఖ్యానించారు.

    ఆండీ..

    ఆండీ..

    రితేష్ దేశ్ ముఖ్‌ను ఉద్దేశించి ఆండీ ట్వీట్ చేస్తూ...‘మీరు ముగ్గురూ సూపర్‌గా నటించారు. కామెడీ అదిరింది. గ్రేట్ జాబ్. కామెడీ కేక' అని ట్వీట్ చేసారు.

    డింకీ...

    డింకీ...

    గ్రాండ్ మస్తీ సినిమా చూసాను. పగలబడి నవ్వాను. థియేటర్లో నవ్వులే నవ్వులు...అంటూ ట్వీట్ చేసారు.

    ఆశిష్ ట్వీట్...

    ఆశిష్ ట్వీట్...

    నిన్న రాత్రి గ్రాండ్ మస్తీ సినిమా చూసాను. మొత్తం 7గురు వెళ్లాం. అంతా పగలబడి నవ్వాం. ఇలాంటి కామెడీ సినిమా తీసి నవ్వించినందుకు థాంక్స్... అంటూ ట్వీట్ చేసారు.

    ప్రతీక్ ట్వీట్...

    ప్రతీక్ ట్వీట్...

    గ్రాండ్ మస్తీ సినిమా మూడు సార్లు చూసారు. కాలేజీ ఎగ్గొట్టి మరీ చూసాము. మరోసారి తప్పకుండా చూసుడే..అని ట్వీట్ చేసారు.

    షుమేలా ట్వీట్...

    షుమేలా ట్వీట్...

    సినిమా చూసిన తర్వాత మా మైండ్ మొత్తం గ్రాండ్ మస్తీ సీన్లతోనే నిండిపోయింది. సినిమాను మరిచిపోలేక పోతున్నాం...అంటూ ట్వీట్ చేసారు.

    మానవ్..ట్వీట్

    మానవ్..ట్వీట్

    సూపర్ కామెడీ....సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు చాలా నవ్వు తెప్పించాయి. అదిరింది సినిమా అని ట్వీట్ చేసారు.

     జీనబ్ ట్వీట్...

    జీనబ్ ట్వీట్...

    మనం ఖర్చు పెట్టిన డబ్బులకు పూర్తి సంతృప్తిని ఇచ్చే సినిమా. సినిమా మొత్తం నవ్వులే నవ్వులు. నిజంగానే గ్రాండ్ మస్తీ అని ట్వీట్ చేసారు.

    గ్రాండ్ మస్తీ

    గ్రాండ్ మస్తీ

    ఈ సినిమాను మిస్సయితే చాలా ఫన్ మిస్సవుతాం. తప్పకుండా చూడాల్సిన సినిమా అని అంతా అంటున్నారు.

    English summary
    Bollywood's latest release Grand Masti has unexpectedly received a thumps up from the Indian audience. And with this, we yet again fail to understand the taste of our Indian filmgoers, who on the other hand, had great words 
 for the films like Kahaani, Barfi, 3 Idiots, Bhaag Milkha Bhaag. It's sometimes hard to believe the fact that our people have actually loved a sick movie like that of Grand Masti and unfortunately, we are left with no 
 choice, but digest the reality of the bad taste of our fellow moviebuffs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X