బాలకృష్ణ కుమార్తె వివాహ కళ్యాణ మండపం..వివరాలు
ఈ మండపాన్ని దాదాపు నలభై ఐదు రోజులుగా నూట డబ్బై ఐదు మంది కష్టపడి తయారు చేస్తున్నారు. అలాగే ఈ మండపం హైలెట్స్ లో ..హ్యాంగింగ్ వాటర్ పౌంటెన్స్ చోటు చేసుకోనున్నాయి. వివాహానికి వచ్చే ఆహాతులను ఈ వాటర్ ఫౌంటన్స్ ఆశ్చర్యపరిచి ఆకట్టుకుంటాయని అంటున్నారు. అలాగే ఈ కల్యాణ మండపానికి రెండు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 15 వేల మందికి సరపడా ఏర్పాట్లు చేస్తున్నారు.
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు మనవడైన శ్రీభరత్‌తో తేజస్విని వివాహ నిశ్చితార్థం బాలయ్య ఇంట్లో ఆదివారం ఉదయం 11 గంటలకు జరగింది. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఈ నెల 21వ తేదీ ఉదయం 8:52 గంటలకు వివాహం జరపనున్నారు.
సినీ నటుడు బాలకృష్ణ తన కుమార్తె వివాహానికి అభిమానులందరినీ ఆహ్వానించారు. నందమూరి కుటుంబ అభిమానులంతా పెళ్లికి రావాలని పత్రికాముఖంగా విజ్ఞప్తి చేశారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని వివాహం భరత్‌తో ఈనెల 21న ఉదయం 8:25 నిమిషాలకు మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరగనుంది. పత్రికా ప్రకటననే వ్యక్తిగత ఆహ్వానంగా భావించాలని కోరారు.


Click it and Unblock the Notifications












