twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనవడు ఆరవ్ చేతుల మీదగా 'రాజేష్ ఖన్నా' అంత్యక్రియలు

    By Nageswara Rao
    |

    బాలీవుడ్ తొలితరం సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా చివరి అంత్యక్రియలు అశేష అభిమానులు, ఫ్యామిలీ ప్రెండ్స్, సన్నిహితులు, బాలీవుడ్ అతిరథ మహారధులు మధ్య ఎంతో భారమైన హృదయాలతో వెంటరాగా విలే పార్లే స్మశాన వాటికలో తన మనవడు ఆరవ్ ద్వారా నిర్వహించబడ్డాయి. తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన ఆరవ్ తన తండ్రి అక్షయ్ కుమార్ సహాయంతో చితి కాగడాని రాజేష్ ఖన్నా శరీరానికి అంటించారు. బాలీవుడ్ చిత్ర రంగంలో 1969లో తారాస్దాయికి చెందిన ఈ సూపర్ స్టార్ శరీరం అందరూ చూస్తుండగా కాలిపోయింది.

    రాజేష్ ఖన్నా పెద్ద కూతరు ట్వింకిల్ ఖన్నా, హీరో అక్షయ్ కుమార్‌ల ముద్దుల కొడుకే ఈ ఆరవ్. 69 సంవత్సరాల వయసు కలిగిన రాజేష్ ఖన్నా లివర్ ఇన్ఫెక్షన్‌తో బుధవారం ఉదయాన కన్ను మూసిన సంగతి తెలిసిందే. అభిమానులు, కుటుంబ సభ్యులు ముద్దుగా కాకా అని పిలుకుకునే రాజేష్ ఖన్నా అంత్యక్రియల కార్యక్రమానికి బాలీవుడ్ రంగం నుండి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, సుధీర్ మిశ్రా, రాణి ముఖర్జీ, కరణ్ జోహార్, సాజిద్ ఖాన్, వినోద్ ఖన్నా, ఆదేష్ శ్రీవాత్సవ తదితరులు హాజరయ్యారు. చివరి క్షణాల్లో భార్య డింపుల్ కపాడియా, కుమార్తెలు ట్వింకిల్‌ఖన్నా, రింకి ఖన్నా ఆయనతోనే ఉన్నా రు.

    ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో లెజెండరీ హీరో రాజేష్ ఖన్నా అంతిమ యాత్ర బాంద్రాలోని తన ఇల్లు ఆశిర్వాద్ నుండి ప్రారంభమైంది. చిన్న ట్రక్‌లో ఒక పారదర్శక పేటికలో ఖన్నా శరీరం తెల్లని పుష్పాలతో అలంకరించబడి ఉంది. వేలకొద్ది రాజేష్ ఖన్నా అభిమానులు, స్నేహితులు, కుటుంబం కన్నీటి హృదయాలతో వీడ్కోలు పలికారు. మొదట ఖన్నా బాడీని కార్టర్ రోడ్, టర్నర్ రోడ్, ఎస్ వి రోడ్ మీద గుండా విలే పార్లే స్మశాన వాటికకి తీసుకోని వెళ్లాలని భావించినప్పటికీ.. వర్షం కారణంగా షార్ట్ కట్ రూట్‌లో స్మశాన వాటికకి తీసుకెళ్లారు.

    1966లో ఒక ప్రొడక్షన్ హౌస్, ఫిల్మ్‌ఫేర్ కలిసి నిర్వహించిన టాలెంట్ హంట్‌లో పదివేల మందితో పోటీపడి మొదటివాడిగా నిలిచారు. మొదటి సినిమా చేతన్ ఆనంద్ దర్శకత్వం వహించిన 'ఆఖరీఖత్' (అయినా దానికి ముందు 'రాజ్'లో కనిపిస్తారు) 'ఆరాధన'తోనే బాలీవుడ్ సినిమాలకు కొత్త భాష్యం చెప్పి స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఆయన 163 సినిమాల్లో నటించారు.

    942, డిసెంబర్ 29న జన్మించిన రాజేష్ ఖన్నా అసలు పేరు జతిన్ ఖన్నా. స్వస్థలం అమృత్‌సర్. అయితే తల్లిదండ్రులు ఆయనను తమ బంధువులకు దత్తత ఇవ్వడంతో బాల్యం నుంచి ఎంతో గారాబంగా పెరిగారు. స్కూల్, కాలేజీ రోజుల నుంచి నాటకాల పట్ల ఆకర్షితుడైన ఆయన ఎన్నో నాటకాల్లో మెడల్స్ సాధించి, హిందీ సినిమాల్లో హీరో కావాలని కలలు కన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలే హావెల్స్ ఫ్యాన్ల ప్రకటనలో మెరి సిన రాజేష్ ఖన్నా తన అభిమానులకు ఎంత ఆనందం పం చారో, ముఖంలో దాచలేని అనారోగ్య ఛాయలతో అంతే ఆందోళన నింపారు. ఈ డిసెంబర్‌లో 70వ జన్మదినం జరుపుకోవాల్సిన ఆయన ఆ వేడుకకు కొద్ది నెలల ముందే మృతి చెం దడం విషాదం.

    తెలుగు వన్ఇండియా

    English summary
    The last rites of Rajesh Khanna were performed by his grandson Aarav at the Vile Parle crematorium Thursday with family, friends and fans bidding the superstar a tearful adieu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X