Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నేల టికెట్టు సినిమాకు మంచి బిజినెస్.. రవితేజ కెరీర్ లోనే మొదటిసారి!
ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ''సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం'' వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో, 'మాస్ మహారాజా 'రవితేజ' హీరోగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమా నేల టికెట్. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది.
హీరోయిన్ మాళవిక శర్మ ఈ సినిమాలో రవితేజ సరసన నటిస్తోంది. ఈ సినిమాలో మాళవిక శర్మ మెడికల్ స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. తెలుగులో ఈ హీరోయిన్ చేస్తున్నది మొదటి సినిమానే అయినా అనుభవం కలిగిన హీరోయిన్ లా మాళవిక శర్మ నటించినట్లు సమాచారం. రేపు (గురువారం) సెన్సార్ జరుపుకోనున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.
తాజా సమాచారం మేరకు ఈ సినిమాను 26 కోట్లకు నిర్మాత రామ్ తాళ్లూరి అమ్మేసినట్లు తెలుస్తోంది. సినిమా తీసింది 30 కోట్ల బడ్జెట్ లో అని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంత చేస్తే... విడుదల తరువాత మంచి టాక్ వస్తే సినిమా మరింత ఎక్కువ వసూళ్ళు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రవితేజ కెరీర్ లో ఈ సినిమా ఎక్కువ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.