ఇప్పుడు బాలీవుడ్ హాట్ టాపిక్ ఆర్నాల్డ్ హిందీ సినిమాకి ఒప్పుకోవడం గురించి.వాస్తవానికిఆర్నాల్డ్ స్క్వాజెనెగర్ హీరోగా హిందీ వాళ్ళేమి సినిమా ప్లాన్ చేయటం లేదు గాని'కంబఖ్త్ ఇష్క్' అనే చిత్రంలో ఆయన ఓ గెస్ట్ రోల్ లో కనపడతాడుట.అలాగే ఈ సినిమాలో పాపులర్ పాప్ సింగర్ బియోన్స్ కూడా ప్రధాన పాత్రను పోషిస్తోంది. అక్షయ్ కుమార్, కరీనా కపూర్ జంటగా నటించే ఈ చిత్రాన్నిభారీ చిత్రాల నిర్మాత సాజిద్ నదియడ్‌వాలా నిర్మిస్తున్నారు.షూటింగ్ లో చాలా భాగం లాస్ ఏంజెలిస్‌లో జరుగుతుందిట. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హాలీవుడ్ స్టంట్ మ్యాన్ పాత్రలో కనిపిస్తాడుట.'హాలీవుడ్ నటీనటుల్ని మా సినిమాలో నటింపజేయాలనే ఉద్దేశంతోనే ఈ తరహా కథను సిద్ధం చేశాం. ఆ ప్రకారమే అక్కడి వారితో సంప్రదింపులు జరిపాం. ఆర్నాల్డ్, బెయోన్స్ అంగీకరించడం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే వారితో షూటింగ్ ప్రారంభిస్తామని'నిర్మాత సాజిద్ అంటున్నాడు.అంటే మన తెలుగులో పర భాషా తారలను గెస్ట్ గా పెట్టుకున్నట్లే బాలీవుడ్ కూడా తమ రేంజికి తగినట్లు హాలీవుడ్ ని ఆహ్వానిస్తోందన్నమాట.