మాస్ మసాలా గ్రేట్ లవర్ సిద్ధం
గ్రేట్ లవర్ అనే మిర్చి మసాలా చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సమీక్షబోల్డ్‌గా అందాలు ఆరబోసింది. విశాల్, సమీక్ష జంటగా శ్రీ లక్ష్మీ అన్నపూర్ణేశ్వరీ పిక్చర్స్ పతాకంపై సిహెచ్. సత్యనారాయణ నిర్మిస్తున్న గ్రేట్ లవర్ చిత్రం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ప్రస్తుతం డి.టి.యస్. ఫైనల్‌మిక్సింగ్ జరుగుతోందని, ఇదే వారంలో తొలికాపీ సిద్ధమవుతుందని నిర్మాత తెలిపారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ "విభిన్నమైన ప్రేమకథా చిత్రమిది. హీరో విశాల్ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అలానే సంగీతానికీ ఎంతో ప్రాధాన్యముంది అని చెప్పారు. ఈ సినిమా ద్వారా ప్రశాంత్ చలపతి సంగీత దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ముంబాయి డాన్స్ మాస్టర్స్ డిసౌజా- దీప నేతృత్వంలో హీరో, ముంబాయి డాన్సర్స్‌పై అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేసిన చిత్రీకరించిన పాట హైలైట్‌గా నిలుస్తుంది. ఇదేవారంలో సుప్రీమ్ మ్యూజిక్ ద్వారా ఆడియోను, నెలాఖరుకు సినిమాను విడుదల చేయబోతున్నాం అని అన్నారు.


Click it and Unblock the Notifications