తండ్రి నుంచి ఆ గ్రేట్ క్వాలిటీని రామ్ చరణ్ పొందాడు
మెగాస్టార్ చిరంజీవి కుమారుడుగా రామ్ చరణ్ ఫీల్డులో రంగప్రవేశం చేసినా రెండో సినిమాకే తానేంటనేది ప్రపంచానికి తెలియచేయగలిగాడు.అలాగే రామ్ చరణ్ ని బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేసిన వారు ఓ గొప్ప క్వాలిటీ ని రామ్ చరణ్ తన తండ్రి నుంచి పొందాడని చెప్తూంటారు.అది మరేదో కాదు పబ్లిక్ లో .ఎక్కడా ఎమోషన్స్ ని తన ఫేస్ పై కనపడనియ్యకపోవటమేనంటారు.
ఎంత ఎలాంటి చిరాకు సిట్యువేషన్ ఉన్నా,బ్యాడ్ పొజీషన్ ఉన్నా నవ్వుతూ అక్కడనుంచి తప్పుకోవటానకే చూస్తాడే కానీ అవుట్ బరస్ట్ అయ్యి దాన్ని బయిట పెట్టి అందరి దృష్టిలో పడడంటున్నారు.ఇక తండ్రిలాగానే ఇప్పుడు పూర్తి మాస్ కథలకే అంకితమవ్వాలనే ఆలోచన కొందరి విమర్శలకు గురి చేసినా భవిష్యత్ కి రాచ బాట వేస్తుందంటున్నారు.చిరంజీవి తన కెరీర్ లో రుద్రవీణ వంటి చిత్రాలు చేసినా పక్కా మాస్ మశాలా సినిమాలకే ప్రయారిటీ ఇఛ్చి అభిమానలును సంపాదించుకున్నాడు.ఇప్పుడు రామ్ చరణ్ అదే చేయబోతున్నాడు..రామ్ చరణ్ హీరోగా రచ్చ చిత్రం ప్రారంభం అవుతోంది.


Click it and Unblock the Notifications











