బాలకృష్ణకు అమెరికాలో సన్మానం, అవార్డు
ఈ సందర్భంగా అక్కడున్న తెలుగువారు బాలయ్యను 'గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘము' తరుపున లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించబోతున్నారు. అంతే కాకుండా ఈ వేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఆధ్వర్యంలో సునీత, ఉష, కారుణ్య, హేమచంద్ర, శ్రీకృష్ణ, శ్రావణ భార్గవి, అంజనా సౌమ్యలతో సంగీత కార్యక్రమం ఏర్పాటు చేసారు.
వీరితో పాటు ప్రముఖ హీరోయిన్ నయనతార ప్రత్యేక అతిథిగా ఈ వేడుకలకు హాజరు కాబోతున్నారు. వీరితో పాటు సీనియర్ యాక్టర్ కైకాల సత్యనారాయణ, హీరోయిన్లు మీరా చోప్రా, హంసా నందిని, దువ్వాసి మోహన్ కూడా 'గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘము' 40వ వార్షికోత్సవ వేడుకలకు హాజరై అక్కడి తెలుగు వారిని అలరించనున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. ఇటీవలే ఈచిత్రం షూటింగ్ కూడా ప్రారంభం అయింది. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వారాహి చలన చిత్ర సాయి కొర్రపాటి సమర్పణలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications
