గ్రేట్‌మూవీస్‌కు లక్ష్మీకల్యాణం రైట్స్
సంచలన దర్శకుడు తేజ, నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నిర్మిస్తున్న లక్ష్మీకల్యాణం చిత్రం ఓవర్సీస్ హక్కులను గ్రేట్‌మూవీస్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ సరసన నూతన నటి కాజల్ నటిస్తోంది. ఇది ప్రధానంగా పల్లె నేపథ్యంలో జరిగే కథ. రెండు గ్రామాల మధ్య ఏర్పడే సంఘటనల మధ్య హీరోహీరోయిన్లు తమ ప్రేమను ఎలా సఫలం చేసుకున్నారనే ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో తేజ తీసిన చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అయిన నేపథ్యంలో తాజాగా ఆయన కల్యాణ్‌రామ్ హీరోగా తీస్తున్న ఈ చిత్రంపై అటు ప్రేక్షకులలోనూ, ఇటు బిజినెస్ వర్గాలలోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది.
కొంతకాలంగా వైఫల్యాలు వెన్నాడినా.. అతనొక్కడే.. చిత్రం ద్వారా తన సత్తా నిరూపించుకున్న కల్యాణ్‌రామ్ ఈ చిత్రంలో తమ బాబాయ్ బాలయ్యబాబును గుర్తుకుతెస్తారని అంటున్నారు. తేజ, ఆర్పీ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు చాలావరకూ విజయం సాధించాయి. ఈసారి తిరిగి ఇద్దరూ కలిసి పనిచేస్తున్న చిత్రం లక్ష్మీకల్యాణం. గీత ఆర్ట్స్ పతాకంపై కె. చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా చంటిగాడు ఫేమ్ సుహాసిని, రఘుబాబు, అలీ, ధర్మవరపు, తెలంగాణా శకుంతల, ఉత్తేజ్, శ్రీనివాసరెడ్డి, సుభాషిణి, షాయాజి షిండే తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ముగింపుదశలో ఉన్న ఈ చిత్రం నవంబర్ నాటికి విడుదలవుతుంది.
లక్ష్మీకల్యాణం హక్కులు పొందిన గ్రేట్‌మూవీస్ సంస్థ ఒక ప్రకటనలో ఈ చిత్ర నిర్మాత చంద్రశేఖర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ చిత్రానికి సంబంధించి ఓవర్సీస్ ఎగ్జిబిటర్లు తదితరులు ట్రేడ్ సమాచారం కోసం ఈ కింది వివరాలలో సంప్రదించవచ్చు.


Click it and Unblock the Notifications