twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున ‘గ్రీకు వీరుడు’ ఆడియో ఏప్రిల్ 3న

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కింగ్ నాగార్జున, నయనతార జంటగా రూపొందుతున్న చిత్రం 'గ్రీకు వీరుడు'. ఈచిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఏప్రిల్ 3న శిల్పకళా వేదికలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు.

    'గ్రీకు వీరుడు'లో నాగార్జున ఓ ఎన్నారైగా, డిఫరెంట్ గెటప్ లో స్టైలిష్‌గా కనిపించనున్నారు. గతంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సంతోషం' చిత్రానికి దర్శకత్వం వహించిన దశరత్ ఈ చిత్రానికి దర్శకుడు. నాగార్జున ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ లేడీ ఉండటం, సంతోషం లాంటి హిట్ చిత్రాలు అందించిన నాగ్-దశరత్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి.

    మీరాచోప్రా, కె.విశ్వనాథ్, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు, వేణుమాధవ్, వెన్నెల కిషోర్, కాశీ విశ్వనాథ్, నాగినీడు, గీతాంజలి, సుధ, జయలక్ష్మి, జయవాణి, లహరి, ఇందు తదితరులు ఇతర పాత్రధారులు. ఆడియో విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

    ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్.

    English summary
    Nagarjuna’s latest flick Greek Veerudu audio slated for an 3rd April launch. S S Thaman has composed music for this film which is directed by Dasarath. Nayantara is paired opposite Nagarjuna in this mature love story and Shiva Prasad Reddy is the producer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X