twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గ్రీకు వీరుడు’ ఆడియో ఫోస్ట్ ఫోన్ ..డిటేల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్: నాగార్జున, నయనతార జంటగా రూపొందుతున్న చిత్రం 'గ్రీకు వీరుడు'. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో మార్చి 23న విడుదలకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తేదీ మారినట్లు సమాచారం. మార్చి 30న హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ ఫంక్షన్ ని ఘనంగా జరపాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే గుడ్ న్యూస్ ఏమిటంటే...ఈ చిత్రం మొదట అనుకున్నట్లు షెడ్యూల్ లో ఏ మర్పూ లేకుండా ఏప్రియల్ 19న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించారు.

    ఈ చిత్రం గురించి నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ...''చాలాకాలం తర్వాత నాగార్జున చేస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. నాగ్, నయనతార కాంబినేషన్‌లో సాగే ప్రేమకథ అన్ని వయసుల వారికీ నచ్చుతుంది. ఇందులో కొత్త నాగార్జునను చూస్తారు. మార్చిలో పాటలను విడుదల చేస్తాం'' అని తెలిపారు.

    'గ్రీకు వీరుడు'లో నాగార్జున ఓ ఎన్నారైగా, డిఫరెంట్ గెటప్ లో స్టైలిష్‌గా కనిపించనున్నారు. గతంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సంతోషం' చిత్రానికి దర్శకత్వం వహించిన దశరత్ ఈ చిత్రానికి దర్శకుడు. నాగార్జున ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ లేడీ ఉండటం, సంతోషం లాంటి హిట్ చిత్రాలు అందించిన నాగ్-దశరత్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి.

    మీరాచోప్రా, కె.విశ్వనాథ్, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు, వేణుమాధవ్, వెన్నెల కిషోర్, కాశీ విశ్వనాథ్, నాగినీడు, గీతాంజలి, సుధ, జయలక్ష్మి, జయవాణి, లహరి, ఇందు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: అనిల్ భండారి, సంగీతం: తమన్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: రవీందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేకానంద కూచిభొట్ల, సహ నిర్మాత: డి.విశ్వచందన్‌రెడ్డి, నిర్మాణం: కామాక్షి మూవీస్.

    English summary
    
 The audio launch of Greekuveerudu film has been postponed and even the venue of the audio launch has been changed. Greekuveerudu audio launch would now happen on March 30 in Hyderabad. Shilpa Kala Vedika is said to be the venue for the audio launch of the film. The good news for the fans is that despite the postponement of the audio launch the film would arrive on time as announced earlier on April 19. Greekuveerudu is directed by Dasarath who had in the past made the film Santosham with Nagarjuna. Let’s hope this film too is another sweet success for the actor like that film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X