‘గ్రీకు వీరుడు’ ఆడియో ట్రాక్‌లిస్ట్
హైదరాబాద్: కింగ్ నాగార్జున-హాట్ లేడీ నయనతార కాంబినేషన్లో రూపొందుతున్న 'గ్రీకు వీరుడు' చిత్రం ఆడియో ఈ నెల 3న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆడియోకు సంబంధించిన ట్రాక్ లిస్ట్ వివరాలు బయటకు వచ్చాయి.
ఆడియో ట్రాక్ లిస్ట్
1. ఐ హేట్ లవ్ స్టోరీస్
2. నే విన్నది నిజమేనా..
3. ఓ నాడు వాషింగ్టన్
4. ఈ పరీక్షలో తన్నకు..
5. ఎవ్వరు లేరని..
6. ఓసినా బంగారం..
7. మరో జన్మే...
ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఏప్రిల్ 3న శిల్పకళా వేదికలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 19న సినిమా విడుదల కానుంది. 'గ్రీకు వీరుడు'లో నాగార్జున ఓ ఎన్నారైగా, డిఫరెంట్ గెటప్ లో స్టైలిష్‌గా కనిపించనున్నారు. గతంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సంతోషం' చిత్రానికి దర్శకత్వం వహించిన దశరత్ ఈ చిత్రానికి దర్శకుడు.
మీరాచోప్రా, కె.విశ్వనాథ్, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు, వేణుమాధవ్, వెన్నెల కిషోర్, కాశీ విశ్వనాథ్, నాగినీడు, గీతాంజలి, సుధ, జయలక్ష్మి, జయవాణి, లహరి, ఇందు తదితరులు ఇతర పాత్రధారులు.
ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్.


Click it and Unblock the Notifications











