నాగార్జున, వెంకటేష్ మధ్య వార్
హైదరాబాద్ : నాగార్జున, వెంకటేష్ ... ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వారి తాజా చిత్రాలు 'గ్రీకు వీరుడు', 'షాడో' చిత్రాలు ఈ నెల 26న విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ రెండు సినిమాలూ... ఆయా హీరోలకు ప్రత్యేకమే కావటం విశేషం. సినిమా సినిమాకీ మధ్య కనీసం ఓ వారం వ్యవధి ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు నిర్మాతలు. అయితే వీరిద్దరి మధ్యన పోటీ అనివార్యమవుతోంది. వీరిద్దరి మధ్యన కలెక్షన్స్ వార్ జరగనుంది.
పెద్ద సినిమాల విషయంలో వారం విరామం తప్పనిసరి. ఎక్కువ థియేటర్లలో చిత్రాన్ని ప్రదర్శించేందుకు కూడా ఈ విరామం ఉపయోగపడుతుంది. ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదల కావడం.. ఇటీవల కాలంలో తగ్గింది. కానీ విడుదల తేదీలు మొదటి నుంచి మార్చుకుంటూ ఇద్దరూ రావటంతో ..ఇధ్దరకీ ఒకే రోజు ఫిక్సైంది.
ఇక 'షాడో'లో వెంకటేష్ వైవిధ్యంగా కనిపిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో సాగే కథ ఇది. వెంకటేష్ తరహా కుటుంబ బంధాలకూ చోటిచ్చారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. పరుచూరి శివరామ్‌ప్రసాద్ నిర్మాత. మరోప్రక్క నాగార్జున 'గ్రీకువీరుడు'లో కొత్త తరహా గెడ్డం, కేశాలంకరణలతో దర్శనమిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటించింది.
ప్రేమ, కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే కథ 'గ్రీకువీరుడు'. దశరథ్ దర్శకత్వం వహించారు. డి.శివప్రసాద్‌రెడ్డి నిర్మాత. ప్రేమపై భిన్నాభిప్రాయం ఉన్న వ్యక్తులు కలిస్తే ఎలా ఉంటుంది? అనేదే ఈ సినిమా కథ. పూర్తి స్ధాయి రెమాంటిక్ కామెడీగా ఈ చిత్రం రూపొందుతోంది. రెండు చిత్రాలకూ తమన్ సంగీతం అందించడం విశేషం.


Click it and Unblock the Notifications











