‘గ్రీకు వీరుడు’ టైటిల్ ఫైనల్ చేసిన నాగార్జున

By Bojja Kumar

హైదరాబాద్: కింగ్ నాగార్జున, నయనతార జంటగా రూపొందుతున్న చిత్రానికి తాత్కాలికంగా 'లవ్ స్టోరీ' అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. 'సరిలేరు నీకెవ్వరు' అనే టైటిల్ కూడా పరిశీలించారు. అయితే ఈ రెండు టైటిళ్లను కాదని సరికొత్త టైటిల్ ను ఖరారు చేసారు నాగార్జున. ఈ సినిమాకు 'గ్రీకు వారుడు' టైటిల్ ఫైనల్ చేస్తున్నట్లు తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో 'గ్రీకు వీరుడు' పేరుపై అఫీషియల్ పేజీ కూడా క్రియేట్ చేసారు.

'గ్రీకు వీరుడు' చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపకుంటోంది. ఇటీవలే యూరఫ్ లో ఓ షెడ్యూల్ పూర్తయిన తర్వాత బ్యాంకాక్ లో కొంత షూటింగ్ జరిపారు. ఇక్కడ ఓ సాంగు చిత్రీకరణతో పాటు కొన్ని సీన్లు, యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేసారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న 'గ్రీకు వీరుడు'లో నాగార్జున ఓ ఎన్నారైగా, డిఫరెంట్ గెటప్ లో స్టైలిష్‌గా కనిపించనున్నారు.

గతంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సంతోషం' చిత్రానికి దర్శకత్వం వహించిన దశరత్ ఈ చిత్రానికి దర్శకుడు. నాగార్జున ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ లేడీ ఉండటం, సంతోషం లాంటి హిట్ చిత్రాలు అందించిన నాగ్-దశరత్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి.

ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X