twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గ్రీకు దేశంలో గ్రీకు వీరుడు నాగార్జునకి...

    By Srikanya
    |

    'మనం 'గ్రీకువీరుడు' అని ముద్దుగా పిలుచుకునే నాగార్జునగారిని గ్రీకు దేశం ఎంతో గౌరవించి సత్కరించడం చాలా ఆనందంగా ఉంది అంటూ కేడీ చిత్రం నిర్మాత డి.శివప్రసాదరెడ్డి చెప్పుకొచ్చారు. 'గ్రీకువీరుడు'గా పేరొందిన అక్కినేని నాగార్జున కామాక్షి కళామూవీస్‌ పతాకంపై డి.శివప్రసాదరెడ్డి నిర్మిస్తున్న 'కేడి' చిత్రం షూటింగ్‌ నిమిత్తం గ్రీస్‌ దేశం వెళ్లారు. ఈ సందర్భంగా గ్రీకు ప్రభుత్వం, మిలోస్‌ ఐలెండ్‌ ప్రతినిధులు ఆయన్ని సత్కరించారు.

    మిలోస్‌ ఐలాండ్‌లో జరిగిన ఈ సత్కారసభలో గ్రీక్‌ ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడుతూ -"ఈ రోజు గ్రీకు టూరిజం డిపార్ట్‌మెంట్‌కి గ్రేట్‌ డేగా భావిస్తున్నాం. నాగార్జున సినిమా షూటింగ్‌ ఇక్కడ జరగడం మాకు గర్వకారణమైన విషయం. నాగార్జునను సత్కరించే అవకాశం మాకు కల్పించిన కామాక్షి కళా మూవీస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ టీమ్‌కి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మళ్లీ ఆయన మా గ్రీస్‌కి రావాలని కోరుకుంటున్నాం' అని ఆనందం వ్యక్తపరిచారు.

    అనంతరం నాగార్జున మాట్లాడుతూ 'గ్రీస్‌లో షూటింగ్‌ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అన్ని విధాల సహకరిస్తున్న గ్రీక్‌ ప్రభుత్వానికి, టూరిజం డిపార్ట్‌మెంట్‌కు కృతజ్ఞతలు' అన్నారు. నాగార్జున, మమతామోహన్‌దాస్‌లపై ఇక్కడ ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. డిసెంబరు 11 వరకు గ్రీస్‌లో ఈ షూటింగ్‌ జరుగుతుంది. కిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ డి.శివప్రసాదరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి రెండో వారంలో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

    అంకుర్‌, నిర్మల్‌ పాండే, అఖిలేంద్ర మిశ్రా, కెల్లీ డార్జ్‌, షాయాజీ షిండే, బ్రహ్మానందం, హర్షవర్ధన్‌, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : సందీప్‌ చౌతా, ఫొటోగ్రఫీ: సర్వేష్‌ మురారి, పాటలు: చంద్రబోస్‌, కృష్ణ చైతన్య, నిర్వహణ: చెంచురెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అక్కినేని వెంకటరత్నం, నిర్మాత: డి.శివప్రసాదరెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిరణ్‌.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X