హీటెక్కిస్తున్న నయనతార-నాగార్జున రొమాన్స్ (ఫోటోలు)
హైదరాబాద్: కింగ్ నాగార్జున, నయనతార జంటగా రూపొందుతున్న చిత్రం 'గ్రీకు వీరుడు'. ఏప్రిల్ 19వ తేదీన ఈచిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రం ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. తాజాగా విడుదలైన చిత్రాల్లో నాగార్జున-నయనతార మధ్య రొమాంటిక్ సీన్స్ కేక పుట్టిస్తున్నాయి.
'గ్రీకు వీరుడు'లో నాగార్జున ఓ ఎన్నారైగా, డిఫరెంట్ గెటప్ లో స్టైలిష్‌గా కనిపించనున్నారు. గతంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సంతోషం' చిత్రానికి దర్శకత్వం వహించిన దశరత్ ఈ చిత్రానికి దర్శకుడు. నాగార్జున ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ లేడీ ఉండటం, సంతోషం లాంటి హిట్ చిత్రాలు అందించిన నాగ్-దశరత్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి.
మీరాచోప్రా, కె.విశ్వనాథ్, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు, వేణుమాధవ్, వెన్నెల కిషోర్, కాశీ విశ్వనాథ్, నాగినీడు, గీతాంజలి, సుధ, జయలక్ష్మి, జయవాణి, లహరి, ఇందు తదితరులు ఇతర పాత్రధారులు. ఆడియో విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

నాగార్జున-నయనతార మధ్య రొమాంటిక్ సన్నివేశాలు.

గతంలో నాగార్జున-నయనతార బాస్ చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

వీరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో గ్రీకువీరుడులోనూ వీరికాంబినేషన్ రిపీట్ అయింది.

50 ఏళ్లు పైబడినా... నాగార్జున ఈ చిత్రంలో నవ మన్మధుడిలా కనిపించబోతున్నాడు.

నాయనతార ఈచిత్రంలో గతంలో కంటే గ్లామరస్ గా కనిపించడం మరో విశేషం.

ఈ చిత్రంలో నాగార్జున ఓ ఎన్నారైగా, డిఫరెంట్ గెటప్ లో స్టైలిష్‌గా కనిపించనున్నారు.

గ్రీకు వీరుడు చిత్రంలో నాగార్జున-నయనతార రొమాన్స్.

గ్రీకు వీరుడు చిత్రంలో నాగార్జున-నయనతార రొమాన్స్.

గ్రీకు వీరుడు చిత్రంలో నాగార్జున-నయనతార రొమాన్స్.

గ్రీకు వీరుడు చిత్రంలో నాగార్జున-నయనతార రొమాన్స్.

గ్రీకు వీరుడు చిత్రంలో నాగార్జున-నయనతార రొమాన్స్.

గ్రీకు వీరుడు చిత్రంలో నాగార్జున-నయనతార రొమాన్స్.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్.


Click it and Unblock the Notifications











