అయ్యో...‘గ్రీకు వీరుడు’ పబ్లిక్ టాక్ ఇలా ఉందే...!
హైదరాబాద్ : కింగ్ నాగార్జున, సెక్సీ లేడీ నయనతార జంటగా దశరథ్ దర్శకత్వంలో రూపొందిన 'గ్రీకు వీరుడు' చిత్రం ఈ రోజు గ్రాండ్ గా విడులైంది. అయితే సినిమా చూసిన ప్రేక్షకులు అంచనాలకు తగిన విధంగా లేదని అంటున్నారు. మొత్తానికి సినిమా యావరేజ్ అనే టాక్ వినిపిస్తోంది.
సినిమాలో నాగార్జున చందు పాత్రలో అమెరికాలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్వహిస్తున్న వ్యక్తిగా కనిపించారు. ప్రేమ, హ్యూమన్ రిలేషన్ షిప్‌పై నమ్మకం లేదని వ్యక్తి. డబ్బుకు ఎక్కువ విలువ ఇస్తాడు. చారిటబుల్ ట్రస్టులో డాక్టర్ గా పని చేస్తున్న సంధ్య పాత్రలో నయనతార నటించింది. రిలేషన్, లవ్, సెంటిమెంట్స్ మీద నమ్మకం ఎక్కువ ఆమెకు. ఇండియాకు వచ్చిన చందుకు సంధ్యతో పరిచయం ఏర్పడుతుంది. సంధ్య వల్ల చందు ఎలా మారాడు అనేది మిగతా స్టోరీ.
నాగార్జున అందంగానే కనిపించినప్పటికీ అతని క్యారెక్టర్ మాత్రం ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా లేదు. కొన్ని కీలక సన్నివేశాల్లో నాగార్జున ఎమోషన్స్ పర్ ఫెక్ట్ గా పండించలేక పోయాడు. గత సినిమాలను దృష్టిలో ఉంచుకుని నయనతార మరింత సెక్సీగా కనిపిస్తుందని థియేటర్‌కి వెళ్లిన ప్రేక్షకులను...సినిమాలో ఆమె లుక్ నిరాశ పరిచింది. బ్రహ్మీ, ఎమ్మెస్, ధర్మవరపు, కోవై సరళ పాత్రలు కాస్త నవ్వించాయి.
మరోసారి హ్యూమన్ రిలేషన్స్ సబ్జెక్టును ఎంచుకున్న దర్శకుడు కథను పర్ ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయడంలో విఫలం అయ్యాడు. హ్యూమన్ రిలేషన్స్, ఫ్యామిలీ డ్రామా విత్ కామెడీతో కూడిన ఈ సినిమా క్లాస్, ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చినా...మాస్, యూత్ ఆడియన్స్‌కు మింగుడు పడటం కాస్త కష్టమే అనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











