'గ్రీన్ ఛాలెంజ్'లో నగర మేయర్.. సినీ తారల సందడి.. ఎంపీ సంతోష్ విసిరిన ఛాలెంజ్‌కు అపూర్వ ఆదరణ

ప్రస్తుతం 'గ్రీన్ ఛాలెంజ్' హవా నడుస్తోంది. పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటాలనే సదుద్దేశంతో నడుస్తున్న ఈ ఛాలెంజ్‌ని పలువురు సెలెబ్రిటీలు సాదరంగా స్వాగతిస్తున్నారు. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ రోజు రోజుకూ విస్తరిస్తుండటం అభినందనీయం. ఇప్పటికే ఎందరో సినీరాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగమై మొక్కలు నాటారు.

నగర మేయర్‌ ఉత్సాహంగా

నగర మేయర్‌ ఉత్సాహంగా

ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఈ 'గ్రీన్ ఛాలెంజ్'లో పాల్గొన్నారు. శ్రీనగర్ కాలనీ లోని పబ్లిక్ పార్కుతో కొన్ని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బొంతు రామ్మోహన్‌తో పాటు యంగ్ హీరోయిన్ రాశిఖన్నా, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పాల్గొన్నారు. ఈ మేరకు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు మేయర్ బొంతు రామ్మోహన్.

 ప్రోత్సహించాలనే ఉద్దేశంతో..

ప్రోత్సహించాలనే ఉద్దేశంతో..

తెలంగాణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని మొదటగా రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొక్కలు నాటిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సెప్టెంబరు 5న వనమిత్ర అవార్డ్‌ను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి ఈ కార్యక్రమంలో భాగమైన వారందరికీ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

మంచి పేరుతో పాటు భారీ రెస్పాన్స్

మంచి పేరుతో పాటు భారీ రెస్పాన్స్

ఇప్పటికే ఈ కార్యక్రమంలో సినీ నటులు మంచు లక్ష్మి, సాయి పల్లవి, వరుణ్ తేజ్, సుమ పాల్గొని మొక్కలు నాటారు. అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఛాలెంజిల్లో ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మంచి పేరుతో పాటు భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది.

ప్రతిరోజూ పండగే..

ప్రతిరోజూ పండగే..

సాయి ధరమ్ తేజ్, రాశిఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందింది ప్రతిరోజూ పండగే మూవీ. ఇప్పటి వరకు ప్రతిరోజూ పండగే సినిమా నుంచి రిలీజైన అన్ని అప్‌డేట్స్‌కి వచ్చిన ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉందని సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నాడు. డిసెంబర్ 20వ తేదీన 'ప్రతిరోజూ పండగే' సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X