టీచర్లకు షాక్ - ‘సారీ టీచర్’కు గ్రీన్‌సిగ్నల్
ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు నివేదిక కోరిన మానవ హక్కుల కమిషన్‌కు సెన్సార్ బోర్డు గురువారం నివేదిక పంపారు. 'సారీ టీచర్'కు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చామని.. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు. పోస్టర్లలో దృశ్యాలు బాగాలేని పక్షంలో ఫిర్యాదుదారులు జిల్లా కోర్టులకు వెళ్లవచ్చని సూచన చేశారు.
పోస్టర్లలో అసభ్యత ఉంటే తామూ పోలీసులకే ఫిర్యాదు చేస్తామని వివరించారు. యు/ఏ సర్టిఫికేట్ ఇవ్వడం అంటే, దాని ఉద్దేశం.. 12 ఏళ్ల లోపు పిల్లలు చూడాలో వద్దో వారితల్లిదండ్రులే నిర్ణయించుకోవాలని చెప్పడమని వివరించారు. ఆ సినిమా మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నట్లు, మహిళా టీచర్ల హుందాతనాన్ని దెబ్బతీసేదిగా ఉందనడాన్ని, యువతను పక్కదారి పట్టించేదిగా ఉందన్న వాదనను సెన్సార్ బోర్డు కొట్టి పారేసింది.
అయితే సెన్సార్ బోర్డు తీరుపై టీచర్లు మండి పడుతున్నారు. హైకోర్టులో 'పిల్' వేసేందుకు సిద్ధం అవుతున్నారు.


Click it and Unblock the Notifications












