వర్మ ఉగ్రవాది.. హోమో.. ఎన్‌కౌంటర్ చేయాలి.. బీజేపీ నేత, టీవీ ఛానెల్‌పై ఆర్జీవీ సీరియస్!

By Rajababu

Recommended Video

RGV To Files A Case Against TV9

జీఎస్టీ వివాదం మరింత ముదురుతున్నది. ఆ వెబ్ డాక్యుమెంటరీ రూపొందించిన వర్మపై బీజేపీ నేత చేసిన అనుచిత వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తనపై వ్యాఖ్యలు చేసిన నేతపై, ప్రసారం చేసిన టీవీ ఛానెల్‌పై తాను చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటానని వర్మ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. ఆ వివాదంగా మారిన ఆ వాదనలు ఇవే..

 ఎన్‌కౌంటర్ చేయాలని కామెంట్లు

ఎన్‌కౌంటర్ చేయాలని కామెంట్లు

రాంగోపాల్ వర్మపై బీజేపీ నేత తుమ్మలపల్లి పద్మ విరుచుకుపడ్డారు. నేను అన్నీ వదిలేశానని సిగ్గులేకుండా వర్మ చెబుతున్నాడు. ఇలాంటి వాళ్లను వదిలేస్తూ పోలీసులు ఏమి చేస్తున్నారు. హోం మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ఉన్న సమయంలో ఓ మహిళపై యాసిడ్ ఎటాక్ చేసిన విషయంలో నిందితులను ఎన్‌కౌంటర్ చేసేశారు. అలాంటి నేతలు, అధికారులు కావాలి అని పద్మ అన్నారు.

 వర్మ ఉగ్రవాది కంటే ప్రమాదం

వర్మ ఉగ్రవాది కంటే ప్రమాదం

రాంగోపాల్ వర్మ ఉగ్రవాది కంటే ప్రమాదం. అతను హోమో సెక్సువల్ అని జయ్ అనే డైరెక్టర్ చెబుతున్నాడు. అతను చేయలేని పనిని ఇతరుల చేసేలా ప్రేరేపిస్తున్నాడు అని పద్మ చెప్పారు.

పద్మపై కేసు పెడుతా

పద్మ చేసిన వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ తీవ్రంగా తప్పుపట్టారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత తుమ్మలపల్లి పద్మపై కేసు పెట్టేందుకు రెడీ అవుతున్నాను. ఆమె ఏ విధంగా మాట్లాడుతుందో మీరే చూడండి అంటూ ఓ వీడియోను షేర్ చేశారు.

 టీవీ ఛానెల్‌పై మండిపాటు

టీవీ ఛానెల్‌పై మండిపాటు

తనపై ఓ టీవీ ఛానెల్ దుష్ప్రచారం చేస్తున్నదని, ఆ ఛానెల్‌కు చెందిన ప్రజెంటర్ వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నాడు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న కేసు విషయాలను నిబంధనలకు విరుద్ధంగా బయటపెడుతున్నాడు. చట్టాల ప్రకారం టీవీ ఛానెల్‌పై కేసు పెడుతాను. వారిని కోర్టుకు ఇడ్చుతాను అని వర్మ ట్వీట్ చేశాడు..

క్రిమినల్ కేసులు పెడుతా

క్రిమినల్ కేసులు పెడుతా

తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా దుష్ప్రచారం చేస్తున్న సదరు ఛానెల్‌పై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాను. నా తరఫు న్యాయవాదులు ఈ విషయాలపై సమాచారం సేకరిస్తున్నారు.

 వర్మ వరుస ట్వీట్లు

వర్మ వరుస ట్వీట్లు

జీఎస్టీ మేకింగ్ విషయంలో నేను కేవలం ప్రొడక్షన్, టెక్నికల్ ప్రాసెస్ పరిమితమయ్యాను అంటూ ప్రచారం చేస్తున్న కొందరికి ఒకటే చెప్పదలచుకున్నాను. వెబ్ డాక్యుమెంటరీ క్రెడిట్ నాదే క్లియర్‌గా ఉన్నప్పుడు నేను ఎలా వ్యతిరేకిస్తా అని మరో ట్వీట్ చేశారు.

 ముదురుతున్న జీఎస్టీ వివాదం

ముదురుతున్న జీఎస్టీ వివాదం

జీఎస్టీ వివాదంపై ఓ వైపు దర్యాప్తు కొనసాగుతుండగానే ఇటు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఈ అంశం మరింత వివాదంగా మారుతున్నది. ఓ టీవీ ఛానెల్ ప్రసారం చేస్తున్న వార్తలను వర్మ తీవ్రంగా ఖండించడం

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X