For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిజమా, కుట్రనా?: విశాల్ అబద్దాలు చెప్తున్నాడా??

  |

  తమిళ నాడు ఇప్పుడు రాజకీయాలతో వెడేక్కి వేడెక్కి పేలటానికి సిద్దంగా ఉన్న న్యూక్లియర్ బాంబులా ఉంది. ఎక్కడా లేని పరిస్థితి ఇది తమిళనాడులో రాజకీయాలు, సినిమాలూ వేరు వేరు కాదు ర్వెండూ కలిపోతాయి. చాలామంది పెద్దా చిన్నా హీరోలూ, నటులూ, నటీమణులూ రాజకీయాల్లో కుప్పలు తెప్పలుగా ఉంటారు. దాంతో అక్కడ సినిమాని రాజకీయం, రాజకీయాన్ని సినిమా రెండూ పోట్లాడుకుంటూనే ఉంటాయి.

  "మెర్సల్" కొత్త వివాదం.. సిగ్గు లేదా? అంటూ హీరో విశాల్ ఫైర్..

  "మెర్సల్" వివాదం

  ఇప్పుడు కూడా "మెర్సల్" అలాంటి వివాదం లోనే చిక్కుకుంది. అటు రజినీకాంత్, ఇటు కమల్ హాసన్ ఇద్దరూ రాజకీయాల్లోకి వస్తూండటం, వీరితో పాటు చాలామంది నటులు కూడా పొలిటీషియన్లు గా మారటానికి ప్రయత్నీస్తూండటం తో. "మెర్సల్" లో అధికార పార్టీకి ఆగ్రహం కలిగించే విధంగా కొన్ని మాటలూ, సీన్లూ ఉన్నాయంటూ మొదలైన వివాదం, అటు ఇండస్ట్రీనీ, ఇటు రాజకీయాలనీ ఒక ఊపు ఊపేస్తోంది.

  విజయ్ కి మద్దతుగా

  విజయ్ కి మద్దతుగా

  విజయ్ కి మద్దతుగా కమల్, పార్థిబన్, విశాల్ ప్రత్యక్షంగా మద్దతునిస్తే రజినీకాంత్ ఏదో మాటవరసకి అన్నట్టు ఓ ట్వీట్ పడేసాడు. అయితే ఈ విషయం లో వచ్చే కొన్ని వార్తలు ఏది నిజం ఏది అబద్దం అన్నవిశయం అర్థం కాకుండా తికమక పెడుతున్నాయి.

   పైరసీ లో మెర్సల్ సినిమా చూసానని

  పైరసీ లో మెర్సల్ సినిమా చూసానని

  తాను పైరసీ లో మెర్సల్ సినిమా చూసానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బహిరంగంగా చెప్పటం తో, విజయ్ కు మద్దతుగా మాత్రమే కాదు, కోలీవుడ్ నిర్మాతల సంగం అధ్యక్షుడి హోదాలో కూడా విశాల్, రాజాని ప్రశ్నించాడు " అంత పెద్ద స్థాయిలో ఉంది పైరసీ చూసానని చెప్పటం సిగ్గుగా అనిపించటం లేదా అన్నాడు" అంతే రెండో రోజునే విశాల్ కార్యాలయం లో ఐటీ అధికారుల సోదాలుజరిగాయంటూ వార్తలు వచ్చాయి.

  మరో వివాదం

  మరో వివాదం

  విశాల్ ఎదురు తిరిగినందుకే ప్రభుత్వం అతన్ని ఇరుకున పెట్టిందీ అంటూ మరో వివాదం మొదలయ్యింది. అయితే ఇప్పుడు ఇంకో వార్త మొత్తం అందర్నీ అయోమయం లో పడేసింది. ఒక పక్క విశాల్ ఆఫీసులో తనిఖీలు జరిగాయి అంటూంటే మరో పక్క అసలు మేము అక్కడికి వెళ్లనే లేదు అంటున్నారు.

  తనిఖీలు నిర్వహించిందెవరు?

  తనిఖీలు నిర్వహించిందెవరు?

  అయితే మరి తనిఖీలు నిర్వహించిందెవరు? అసలు ఈ వార్త ఎలా వచ్చింది??? అన్నది ఇప్పుడు ప్రశ్న.. విశాల్ ఆఫీసులోనూ.. అతడి సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీలోనూ ఐటీ ప్రత్యేక విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారని పేర్కొనటమే కాదు.. ఆ అధికారుల పేర్లను సైతం బయటకు చెప్పారు.

  విశాల్ అండ్ కో

  విశాల్ అండ్ కో

  తనిఖీల నేపథ్యంలో నటుడు.. నడిగర్ సంఘం ఉపాధ్యక్షుడు కరుణాస్ తో పాటు తాను ప్రతి పైసా పన్ను చెల్లించినట్లుగా విశాల్ ఒక ప్రకటనను విడుదల చేశారు. అటు వీడియా.. ఇటు విశాల్ అండ్ కో తనిఖీలు జరిగినట్లుగా చెబుతుంటే.. మరోవైపు జీఎస్టీ అధికారులు మాత్రం తూచ్.. అలాంటిదేమీ లేదు.. తనిఖీలు అన్నవి నిజం ఎంతమాత్రం కాదని చెప్పటంతో.. ఏది నిజం? ఏది అబద్ధం? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది.

  English summary
  GST officials conduct 'routine inspection' at Tamil actor Vishal's production house is that a fake News??
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X