ఆడవాళ్లను అవమానిస్తాడా? వర్మ‌కు శిక్షపడాల్సిందే.. దోషిగా తెలితే.. గజల్‌కు పట్టిన..

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) వెబ్‌ సిరీస్ దర్శకుడు రాంగోపాల్ వర్మ మెడకు చుట్టుకొన్నది. సామాజిక కార్యకర్తలు దేవీ, మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం వర్మను పోలీసులు విచారించారు. సుమారు నాలుగు గంటల

By Rajababu

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) వెబ్‌ సిరీస్ దర్శకుడు రాంగోపాల్ వర్మ మెడకు చుట్టుకొన్నది. సామాజిక కార్యకర్తలు దేవీ, మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం వర్మను పోలీసులు విచారించారు. సుమారు నాలుగు గంటల విచారణ అనంతరం ల్యాప్‌టాప్ సీజ్ చేసినట్టు సీసీఎస్ అదనపు డీసీపీ రఘువీర్ తెలిపారు. అశ్లీలత, మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మపై నమోదైన కేసు సాధారణమైనది కాదని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు.

జీఎస్టీ ప్రొడ్యూస్ చేయలేదు..

జీఎస్టీ ప్రొడ్యూస్ చేయలేదు..

డీసీపీ రఘువీర్ మీడియాకు తెలిపిన ప్రకారం.. ఐపీసీ 506, 509 సెక్షన్ల ప్రకారం కేసు బుక్ చేశాం. తాము అడిగిన ప్రశ్నలకు వర్మ సమాధానం ఇచ్చారు. జీఎస్‌టీ సినిమాను ప్రొడ్యూస్ చేయలేదని వర్మ చెప్పారు. కేవలం డైరెక్షన్ మాత్రమే చేశానని ఆయన తెలిపారు. స్కైప్‌ ద్వారానే నేను డైరెక్షన్ చేశాను. స్కైప్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ కలెక్ట్ చేశాం. స్కైప్ నుంచి వివరాలు సేకరిస్తాం. ల్యాప్ ట్యాప్‌ను ఎఫ్ఎస్ఎల్‌కు పంపిస్తాం వర్మ వెల్లడించారు అని డీసీపీ అన్నారు.

 విదేశాలకు వెళ్లడంపై విచారణ

విదేశాలకు వెళ్లడంపై విచారణ

పోలెండ్‌, బ్రిటన్‌లో జీఎస్టీ చిత్రీకరణ జరిగిందని వర్మ చెప్పాడు, ఆయా దేశాలకు వర్మ వెళ్లడంపైనా విచారణ చేస్తున్నాం. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు వర్మ సమయం కోరాడు. వచ్చేవారం విచారణకు హాజరుకావాలని కోరాం అని డీసీపీ తెలిపారు.

సామాజిక కార్యకర్తలకు వర్మ సారీ

సామాజిక కార్యకర్తలకు వర్మ సారీ

అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మహిళా సంఘం నేతలు దేవీ, మణికి రామ్ గోపాల్ వర్మ క్షమాపణలు చెప్పారు. జీఎస్టీ సినిమా వివాదంపై డిబేట్‌లో భాగంగా రామ్ గోపాల్ వర్మ వాళ్లను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీవీ చానెల్ డిబేట్ సందర్భంగా తమను అవమానించే విధంగా మాట్లాడాడు. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఎమోషనల్‌‌లో భాగంగానే అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. అందుకు తాను సారీ చెబుతున్నాను. వారంటే తనకు అపారమైన గౌరవం ఉంది అని వర్మ చెప్పారు.

వర్మ సారీ చెప్పినా ఒప్పుకోం..

వర్మ సారీ చెప్పినా ఒప్పుకోం..

వర్మ చెప్పిన క్షమాపణలను ఐద్వా నేత మణి స్వీకరించలేదు. తనను రాంగోపాల్ వర్మ దారుణంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తదుపరి చిత్రంలో తనను పెట్టి సినిమా తీస్తానని వర్మ చాలా దిగజారి మాట్లాడారు. ఆయన చెప్పిన సారీ నేను అంగీకరించడం లేదు. ఆయనకి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందేనని అని మణి తేల్చి చెప్పినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి.

శిక్షపడాల్సిందేనట

శిక్షపడాల్సిందేనట

ఆడవాళ్లని అవమానించిన వారికి ఏ శిక్ష పడుతుందో అదే శిక్ష వర్మకు పడాలని మణి ఆశాభావం వ్యక్తం చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. మణి క్షమాపణలు స్వీకరించని అంశంపై కూడా వర్మ స్పందించారు. కేసును ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని ఓ ఛానల్ నిర్వహించిన డిబేట్‌లో వర్మ తెలిపారు.

దోషిగా రుజువైతే కఠినశిక్షే

దోషిగా రుజువైతే కఠినశిక్షే

అశ్లీలత, మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మపై నమోదైన కేసు సాధారణమైనది కాదని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. ఆషామాషీగా కేసును విచారించలేమని, ఈ వ్యవహారంలో వర్మ దోషిగా తేలితే ఏడేళ్లవరకు శిక్ష పడే అవకాశం ఉన్నదని తెలిపారు. గతంలో కూడా ఇటువంటి కేసుల్లో తీవ్రతను బట్టి శిక్షలు పడ్డాయని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X