twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాటలో జీఎస్టీ ఉందని నో చెప్పారట: ఇంద్రసేనకి జీఎస్టీ కష్టాలు

    ఈ మధ్య జీఎస్టీ అంటే మెర్సల్ సినిమా కూడా గుర్తొచ్చేలా "మెర్సల్" సినిమాలో డైలాగ్స్ సెన్సేషన్ అయ్యాయి. ఇక ఈ జీఎస్టీపై పంచులు పేల్చారనే ‘మెర్సల్’, దాని అనువాదం "అదిరింది"కి కొందరు నాయకులు చుక్కలు

    |

    జీఎస్టీ అనే మాట వినబడితే చాలు కేంద్ర ప్రభుత్వమే గుర్తొస్తుంది. అయితే ఈ మధ్య జీఎస్టీ అంటే మెర్సల్ సినిమా కూడా గుర్తొచ్చేలా "మెర్సల్" సినిమాలో డైలాగ్స్ సెన్సేషన్ అయ్యాయి. ఇక ఈ జీఎస్టీపై పంచులు పేల్చారనే 'మెర్సల్', దాని అనువాదం "అదిరింది"కి కొందరు నాయకులు చుక్కలు చూపించారు. వారు చూపించిన చుక్కల తర్వాత జీఎస్టీ అనే పదం సినిమాల్లో ఎక్కడైనా వినబడితే.. కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుందని భావించిన సినిమావాళ్లు ఆ పదాన్ని వాడటమే మానేశారు.

    జీఎస్టీ వీడియో సాంగ్‌

    జీఎస్టీ వీడియో సాంగ్‌

    కానీ వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఓ మార్క్ ను సృష్టించుకున్న హీరో విజయ్ ఆంటోని తాజాగా తాను చేస్తున్న "ఇంద్రసేన" చిత్రం కోసం ఏకంగా జీఎస్టీపై ఓ సాంగ్‌నే కంపోజ్ చేసేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఈ జీఎస్టీ వీడియో సాంగ్‌ని మాస్ రాజా రవితేజ విడుదల చేశారు.

    కేవలం సాంగ్ మాత్రమే

    కేవలం సాంగ్ మాత్రమే

    జీఎస్టీపై డైలాగ్స్‌ను ఎడిట్ చేసిన తర్వాత "అదిరింది"కి సెన్సార్ బోర్డ్ ఓకే చెప్పింది. ప్రస్తుతం విజయ్ ఆంటోని నటిస్తున్న ఇంద్రసేన సినిమా కూడా అదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తోంది. సెన్సార్‌ ముందుకు సినిమాను తీసుకు వెళ్లేసరికి "జీఎస్టీ" పదాన్ని తీసేయమని చెప్పారట!

    జీఎస్టీకి వ్యతిరేకంగా

    జీఎస్టీకి వ్యతిరేకంగా

    దాంతో "జీఎస్టీ"ని ఈఎమ్‌ఐ గా మార్చి పాటను మళ్లీ రాసి, సింగర్స్‌తో రికార్డ్‌ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఇదంతా తమిళ హీరో విజయ్‌ ‘మెర్సల్‌' ఎఫెక్ట్‌ ఏమో! తెలుగులో ‘అదిరింది'గా విడుదలైన ‘మెర్సల్‌'లో జీఎస్టీకి వ్యతిరేకంగా రెండు మూడు డైలాగులున్నాయి.

    జీఎస్టీ డైలాగులు లేవు

    జీఎస్టీ డైలాగులు లేవు

    సినిమా విడుదలైన తర్వాత తమిళనాట రాజకీయ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో నిర్మాతలు స్వచ్ఛందంగా జీఎస్టీ డైలాగులను మ్యూట్‌ చేశారు. తెలుగులో మూడు వారాలు ఆలస్యంగా విడుదలైన "అదిరింది"లోనూ జీఎస్టీ డైలాగులు లేవు. ఇకపై, ఏ సినిమాలోనూ "జీఎస్టీ" అనే పదం వినబడదేమో!!

    ప్రభుత్వంపై సెటైర్లు

    ప్రభుత్వంపై సెటైర్లు

    "జీఎస్టీలా నీవే వచ్చి ఎంత పని చేస్తివే.. మాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే
    భూకంపంలా వీధికొచ్చి బొమ్మే చూపి పోతివే.. చూపుల్తో గుణపాలే గుచ్చి గుండె లాక్కుపోతివే.." పల్లవితో ఉన్న ఈ పాట ఒక అమ్మాయి ప్రేమని ప్రేమికుడు వర్ణించే విధంగా ఉంది తప్ప, ప్రభుత్వంపై సెటైర్లు వేసే విధంగా అయితే లేదు. మరో విషయం ఈ పాటని ప్రేమకి చిహ్నమైన తాజ్‌మహల్ సెట్‌తో పాటు అందమైన లోకేషన్లలో చిత్రీకరణ జరపడమే.

    ఇంద్రసేన

    ఇంద్రసేన

    ఆర్.స్డూడియోస్, విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై జి.శ్రీనివాసన్ దర్శ‌క‌త్వంలో రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని "ఇంద్రసేన" చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా ఏక కాలంలో న‌వంబ‌ర్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.

    English summary
    Recently, Adirindi, the dubbed version of Tamil hit Mersal, became the eye of the storm for its dialogues mocking the government’s GST regimen. After much controversy, although the Tamil version got a clearance, the censor board asked the distributors of the Telugu version to edit out the dialogues. Now, another film, Indrasena, is facing the same problem.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X