3 హిట్స్ ఎఫెక్ట్ : 15 కోట్లు డిమాండ్ చేస్తున్న యువహీరో!
ముంబై : హిట్టు కొట్టినోడే ఇండస్ట్రీలో హీరో. ఏ పరిశ్రమ తీసుకున్నా ఇదే పరిస్థితి. హిట్ కొట్టిన హీరోల చుట్టే దర్శక నిర్మాతలు తిరుగుతుంటారు. వారు డిమాండ్ చేసినంత మొత్తం ఇచ్చి మరీ సినిమాలు చేస్తుంటారు. వరుస ప్లాపులు చవి చూసిన హీరోలు మూట ముల్లె సర్దుకోవాల్సిందే. ఏ పరిశ్రమ ఇందుకు అతీతం కాదు.
బాలీవుడ్ సినీ పరిశ్రమ విషయానికొస్తే....రాక్ స్టార్, బర్ఫీ, యే జవానీ హై దివానీ చిత్రాలతో వరుస విజయాలు సొంతం చేసుకున్న బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ యే జవానీ హై దివానీ చిత్రంతో రూ. 100 కోట్లు వసూలు చేసే సత్తా ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేసాడట.
బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు సినిమాకు రూ. 15 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. రణబీర్ కపూర్ ప్రస్తుతం అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో 'బేషరామ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రూ. 15 కోట్లు తీసుకుంటున్నాడట. దీంతో పాటు 'రాయ్' అనే సినిమాకు కూడా కేమిట్ అయ్యాడు.
'రాయ్' చిత్రంలో రణబీర్ కపూర్ అర్జున్ రాంపాల్‌తో కలిసి నటిస్తున్నాడు. 'రాయ్' చిత్రానికి సోలో హీరో కాక పోయినా.....రెగ్యులర్‌గా తీసుకునే రూ. 15 కోట్లు చార్జ్ చేస్తున్నాడట రణబీర్. దీంతో పాటు ప్రాఫిట్స్‌లో షేర్ కూడా డిమాండ్ చేస్తున్నాడని వినికిడి.

రాయ్
బాలీవుడ్ యువ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న ‘రాయ్' చిత్రానికి కొత్త వ్యక్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈచిత్రం ద్వారా విక్రమ్ సింగ్ అనే వ్యక్తి దర్శకుడుగా మారబోతున్నాడు.

అర్జున్ రామ్ పాల్
‘రాయ్' చిత్రంలో రణబీర్ కపూర్‌తో పాటు అర్జున్ రామ్ పాల్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోలదీ ముఖ్య పాత్రలనే అని అంటున్నారు ఈ చిత్రానికి సంబంధించిన యూనిట్ సభ్యులు.

సిక్ అవతారంలో రణబీర్
రణబీర్ బాలీవుడ్లో ‘బేషరామ్' అనే మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు. అభివన్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో రణబీర్ కపూర్ సిక్ యువకుడిగా కనిపించబోతున్నాడు.

బేషరామ్
అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బేషరామ్' చిత్రం అక్టోబర్ 2, 2013లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈచిత్రంలో పల్లివి శర్మ అనే కొత్త అమ్మాయి బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది.

రిషి-నీతూ
రణబీర్ కపూర్ తల్లిదండ్రులు రిషి కపూర్, నీతూ కపూర్ తొలిసారిగా తమ కొడుకు చేస్తున్న ‘బేషరామ్' చిత్రం కోసం నటిస్తున్నారు. ఈ అంశం సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఇందులో వీరి పాత్రలు కీలకంగా ఉండనున్నాయి.


Click it and Unblock the Notifications











