గెస్ట్ హౌజ్ సీజ్: హైకోర్టును ఆశ్రయించిన హీరో ప్రభాస్‌

Recommended Video

Prabhas's Guest House Enfolded | Filmibeat Telugu

టాలీవుడ్ స్టార్ ప్రభాస్‌కు చెందిన గెస్ట్ హౌస్‌ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారులోని రాయదుర్గం పరిధిలోని సర్వే నెం.46లోని స్థలం ప్రభుత్వం స్థలంగా గుర్తిస్తూ సుప్రీం కోర్టు తీర్పుఇవ్వడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభాస్‌తో పాటు సర్వే నెం.46లో భూమి ఉన్న వారు హై కోర్టును ఆశ్రయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థలాన్ని వదులుకునేది లేదని, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అంటున్నారు.

ప్రభాస్ ఇష్టపడి కొనుక్కున్న స్థలం

ప్రభాస్ ఇష్టపడి కొనుక్కున్న స్థలం

ఇది ప్రభాస్ ఇష్టపడి కొనుక్కున్న స్థలం. 46 సర్వే నెంబర్లో 84.30 ఎకరాల స్థలం ఉండగా చాలా మంది కొనుగోలు చేశారు. ఇందులో ప్రభాస్‌‌కు 2,200 గజాల్లో గెస్ట్ హౌస్ ఉంది. ఇది ప్రభుత్వ స్థలం అని అధికారులు వాదిస్తుంటే ఇది మాదే అని ఇందులో స్థలాలు ఉన్నవారు అంటున్నారు.

చాలా రోజుల నుంచి వివాదం

చాలా రోజుల నుంచి వివాదం

ఈ స్థలంపై ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల మధ్య సుప్రీం కోర్టులో కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది. కొన్నేళ్ల క్రితం ఈ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై అందరూ కోర్టుకు వెళ్లారు. న్యాయ స్థానం వీరికి అనుకూలంగా తీర్పు ఇవ్వకపోయినా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై స్టే ఇచ్చింది. అక్కడితో ఆ గొడవ సద్దుమణిగింది.

స్టే ఎత్తివేయించిన అధికారులు

స్టే ఎత్తివేయించిన అధికారులు

మూడు నెలల క్రితం శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు కోర్టుకు వెళ్లి స్థలంపై ఉన్న స్టే ఎత్తివేయించారు. దీంతో భూమిని స్వాధీనం చేసుకునేందుకు అవకాశం లభించింది. ఎన్నికల సమయం కాబట్టి మూడు నెలలుగా సైలెంటుగా ఉన్న అధికారులు.... సోమవారం అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. ప్రభాస్ గెస్ట్ హౌస్‌కు తాళం వేసి ఉండటంతో సీజ్ చేసి నోటీసులు అంటించారు.

సాహో

సాహో

కాగా... ప్రభాస్ నటిస్తున్న ‘సాహో' రిలీజ్ డేట్ అధికారికంగా వెల్లడైంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 15, 2019లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్, శ్రద్ధ కపూర్ హీరో హీరోయిన్లుగా సుజీత్ దర్శకత్వంలో యూవి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X