చిరంజీవికి గిన్నిస్ బుక్ అరుదైన గౌరవం.. చంద్రబాబు, పవన్, రేవంత్, కేటీఆర్ ప్రశంసల వర్షం

అతి సాధారణంగా 46 వ‌సంతాల క్రితం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన అద్భుత‌మైన ప్ర‌తిభావంతుడు కొణిదెల శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్.. ఇప్పుడు ఆయ‌న మెగాస్టార్‌. మెగాబాస్‌. అంద‌రికీ అన్న‌య్య‌... ది గ్రేట్ చిరంజీవి. ఒక్కో మెట్టూ ఎక్కుతూ, ఒక్కో సినిమాతో ప్రూవ్ చేసుకుంటూ, అచంచల‌మైన ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శిస్తూ, అనిత‌ర‌సాధ్య‌మైన ఎత్తుల‌ను చేరుకుంటూ మెగాస్టార్‌గా, త‌ర‌త‌రాల‌కు స్ఫూర్తి పంచే ట్రూ ఐకాన్‌గా ప్ర‌యాణాన్ని సాగిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇప్ప‌టిదాకా దాదాపు 24వేల డ్యాన్స్ మూవ్స్ చేశారు. ఆయ‌న కెరీర్‌లో 537 పాట‌ల్లో ఈ డ్యాన్స్ మూవ్స్ ఉన్నాయి. ఇప్ప‌టిదాకా 156 సినిమాల కెరీర్ ఆయ‌న‌ది. ఇన్నేళ్ల కెరీర్‌లో అనిత‌ర సాధ్య‌మైన ప్ర‌తిభ‌తో, తెలుగు వారంద‌రూ గ‌ర్వించేలా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి, పవన్ కల్యాణ్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ ధన్యవాదాలు తెలిపారు. వారు చేసిన ట్వీట్‌లో ఏమని ప్రశంసించారంటే..

Guinness BooK Record for Chiranjeevi

అన్నయ్య చిరంజీవి గారికి సినీ ప్రపంచంలో రికార్డులు, విజయాలు కొత్త కాదు. ఈ రోజు అన్నయ్య గారి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో లిఖితం కావడం ఎంతో ప్రత్యేకం. 156 చిత్రాలు... 537 పాటలు... 24 వేల స్టెప్స్ తో అలరించిన నటుడిగా చిరంజీవి గారి పేరు నమోదు కావడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. ద మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమా అని గిన్నిస్ బుక్ రికార్డు గౌరవించడం ప్రతి ఒక్కరికీ ఆనందాన్నిస్తుంది. అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అరుదైన గౌరవం కల్పించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. శ్రీ కొణిదెల చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కడం తెలుగు వారు గర్వించదగ్గ విషయం. ఈ శుభ సందర్భంలో వారికి నా అభినందనలు అని రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో వెల్లడించారు.

కేటీఆర్ స్పందిస్తూ.. కెరీర్ ఆరంభించినప్పటి నుంచి అదే డామినెన్స్. చిరంజీవి గారు మీది అద్బుతమైన ప్రయాణం. సెప్టెంబర్ 22వ తేదీ 1978 రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి 46 ఏల్ల తర్వాత ఇండియన్ మోస్ట్ ప్రొలిఫిక్ స్టార్ అంటూ ప్రపంచం గిన్నిస్ బుక్ రికార్డుతో సెలబ్రేట్ చేసుకొంటున్నది అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

తన కెరీర్‌లో 156 సినిమాలు, 537 పాటలు, 24000 డ్యాన్స్ మూమెంట్స్, ఎన్నో మరిచిపోలేని అనుభూతులను చిరంజీవి గారు అందించారు. ఎన్నో లక్షల మందికి స్పూర్తిగా నిలిచారు. సినీ రంగానికి, ఎన్నో తరాలకు స్పూర్తినిచ్చిన మీకు, తెలుగు సినిమాకు గర్వంగా నిలిచిన మీకు నా కంగ్రాట్స్ అని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ ఓ ప్రకటనలో.. సినిమా రంగంలో లెజెండ్‌కు సెల్యూట్. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన చిరంజీవి గారికి కంగ్రాట్స్. 46 ఏళ్ల కెరీర్, 156 సినిమాలు, 537 పాటలు, 24000 డ్యాన్స్ మూమెంట్స్. మీకు ఐకానిక్ లెగసీని సాధించారు. తెలుగు సినిమాకు గర్వకారణమైన క్షణాలివి అంటూ భారత రాష్ట్ర సమితి తన ట్వీట్‌లో పేర్కొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X