twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ హీరోయిన్ కాళీ అవతారం (ఫోటో)

    By Bojja Kumar
    |

    ముంబై: ఒకప్పటి స్టార్ హీరోయిన్, హాట్ అండ్ సెక్సీ తార మాధురి దీక్షిత్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తన వయసుకు తగిన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తోంది. త్వరలో మాధురి దీక్షిత్ 'గులాబ్ గ్యాంగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో మాధురి దీక్షిత్ కాళీ అవతారంలో కనిపించడాన్ని బట్టి చూస్తే దుష్టుల ఆగడాలను అడ్డుకునే పాత్రలో ఆమె కనిపించనుందని తెలుస్తోంది.

    గులాబ్ గ్యాంగ్ చిత్రం ద్వారా సౌమిక్ సేన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రంలో మాధురి దీక్షిత్ పల్లెటూరి మహిళగా డీగ్లామరస్ పాత్ర పోషిస్తోంది. గులాబ్ గ్యాంగ్‌కు ఆమెనే నాయకురాలిగా కనిపించబోతోంది. మాధురి ఈ చిత్రంలో చేసే యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజిలో ఉండనున్నాయి. మరో విశేషం ఏమిటంటో ఈచిత్రంలో మరో మాజీ స్టార్ హీరోయిన్ జుహి చావ్లా కూడా నటిస్తోంది.

    హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన తర్వాత చాలా కాలం పాటు తెరకు దూరమైన మాధురి దీక్షిత్, 'ఆజా నచ్లే' చిత్రం ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది. అయినప్పటికీ గులాబ్ గ్యాంగ్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈచిత్రం కోసం మాధురి యాక్షన్ కొరియోగ్రాఫర్ కనిష్కశర్మ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నారు.

    తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ఈ చిత్రాన్ని సహారా మూవీస్ స్టూడియోస్ సమర్పణలో అనుభవ్ సిన్హా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిన 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మాధురితో పాటు జుహి చావ్లా, మహి గిల్, తనిష్ట చటర్జీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

    English summary
    Gulaab Gang's first poster came out on Friday (November 22) with Madhuri Dixit seen in the 'Kaali' avatar of goddess Durga. The fiery combination of red and yellow colours in the background adds to the curiosity about her role in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X