గులాబీ దళపతి: సైన్యానికి సైరనై.. (పిక్చర్స్)

By Pratap

హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల చిరకాల స్వప్నాన్ని నిజం చేయడానికి తన ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి ఉద్యమమే ఊపిరిగా పోరాడిన నాయకుడి ప్రస్థానమే గులాబి దళపతి చిత్రమని దర్శకు పర్స రమేష్ మహేంద్ర అన్నారు గతంలో బ్రహ్మానందంతో 999 చిత్రాన్ని తీసిన ఆయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం గులాబి దళపతి.

తెలంగాణ ఆర్ట్స్ పతాకంపై గట్టు విజయ్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బోలే షావలి సంగీత సారథ్యంలో పాటల రికార్డింగ్ సోమవారం హైదరాబాదులో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి సైన్యానికి సైరనై - సమరానికి ధైర్యమై అంటూ సాగే పాటను ప్రారంభించారు.

తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల స్వప్నం ఇది అని, తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట సాధన కోసం పోరాడిన ఓ రాజకీయ నాయకుడి కథ ఇది అని చిత్ర దర్శకుడు పర్స రమేష్ మహేంద్ర చెప్పారు. మరో 15 రోజుల్లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత విజయ్ గౌడ్ చెప్పారు. ఓ ప్రముఖ నటుడు ఇందులో నటిస్తున్నారని, బోలో చక్కని పాటలు ఇచ్చారని, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రోత్సాహం మరువలేనదని ఆయన అన్నారు.

గులాబీ దళపతి పాటలు...

గులాబీ దళపతి పాటలు...

గులాబి దళపతి సినిమా పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ప్రారంభించారు.

గులాబీ దళపతి పాటలు..

గులాబీ దళపతి పాటలు..

ఒక నాయకుడి గురించి సినిమా తీయాలనప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం వరకు మన ముందు జరిగిన వాస్తవ సంఘటనలను తెరపై చూపించబోతున్న ఈ జట్టును అభినందిస్తున్నానని మధుసూదనాచారి అన్నారు.

గులాబీ దళపతి పాటలు..

గులాబీ దళపతి పాటలు..

రెండు బలమైన పార్టీలు, ఇద్దరు బలమైన నాయకులతో పోరాటం చేసి నేడు రాష్ట్రాన్ని సాధించుకున్నామని మధుసూదనాచారి అన్నారు.

గులాబీ దళపతి పాటలు...

గులాబీ దళపతి పాటలు...

అయితే కెసిఆర్ శవయాత్ర లేదంటే తెలంగాణ విజయయాత్ర జరగాలని కెసిఆర్ పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారని మధుసూదనాచారి అన్నారు.

గులాబీ దళపతి పాటలు..

గులాబీ దళపతి పాటలు..

ఈ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలంగాణ ప్రజలకు మంచి అనుభూతిని, అనుభవాలను ఇచ్చేలా ఉండాలని, పాటలు చక్కగా ఉన్నాయని స్పీకర్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X