గులాబి గ్యాంగ్ లీడర్ ‘టబు’

By Staff

బెంగాలీ ఫిల్మిం మేకర్ షామిక్ సేన్ దర్శకత్వం వహిస్తున్నా చిత్రం 'గులాబ్ గ్యాంగ్". మరో విశేషం ఏటంటే మేకప్ నిపుణుడు సుభాష్ సింగ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక సినిమా తీయాలని అల్లిన కథ కాదిది. నిజజీవితంలో జరిగిన సంఘటనల సమాహారంతో సామాజిక స్పృహతో ఉన్న కథతో కూడుకొన్నది. కథాశం పరంగా ఉత్తరప్రదేశ్ లో గల వెనుకబడిన ప్రాంతం 'బాందా" నేపధ్యంలో ఈ చిత్రం ఉంటుందని టబు, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ గులాబి గ్యాంగ్ లో మొత్తం 500 మంది మహిళలు ఉంటారు. వాళ్ళంతా గులాబి రంగు చీరలు కట్టుకుంటారు. యూనీఫాం లాగా అన్నమాట, ఇంతకీ ఈ గ్యాంగ్ ఏం చేస్తుంది? అనే విషయాకొస్తే న్యాయం కోసం పోరాటం. ఈ క్రమంలో అన్యాయాన్ని ఎదిరించడానికి ఎలాంటి సాహసాలైనా చేస్తారన్నమాట. స్త్రీ అబల అని వినపడితే వీళ్లకి అస్సలు నచ్చదు. ఈ పవర్ ఫుల్ స్టోరీతో 'గులాబ్ గ్యాంగ్" పేరిట ఓ హిందీ చిత్రం రూపొందనుంది. హాలీవుడ్ మూవీ '300" తరహాలో ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు కూడా వుంటాయంటున్నారు. ఇందుకు సంబంధించి గ్యాంగ్ లో సభ్యలుగా నటిస్తున్న మహిళలకు పోరాట దృశ్యాలకు సంబందించి శిక్షణ కూడా ఇప్పిస్తున్నారట. ఈ పవర్ ఫుల్ సినిమా సంచలనం సష్టిస్తుందనే చర్చలు మొదలయ్యాయి. ఇంకా ఇందులో సహానా గోస్వామి, మహీ గిల్, సంద్య మృదుల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X