పవన్ కళ్యాణ్ గెటప్‌లో కేక పుట్టించిన అలీ (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు కమెడియన్ అలీ. మరి అలాంటి అలీ పవన్ కళ్యాణ్ గెటపల్‌లో వచ్చి ఆయన సినిమాలోని పాటకు డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? కేక పుట్టించేలా ఉంటుంది కదూ! గల్ఫ్ ఆంధ్రా మ్యూజిక్ అవార్డుల నిర్వాహకులకు ఇలాంటి ఆలోచనే వచ్చింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బాబా గెటప్‌లో అలరించిన సంగతి తెలిసిందే. అచ్చం అలాంటి గెటప్‌తోనే గల్ఫ్ ఆంధ్రా మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో దర్శనం ఇచ్చారు అలీ.

పవన్ కళ్యాణ్‌ను మరిపించేలా స్టెప్స్ వేసి ఆడియన్స్‌తో కేరింతలు కొట్టించారు. నటి హేమ కూడా అలీ పెర్ఫార్మెన్స్‌కు తోడై దుమ్ము రేపింది. ఇక చార్మి, పూనమ్ బజ్వా, కామ్నా జఠ్మలానీ, జబర్దస్త్ కామెడీ సో టీం తదితరులు కూడా తమ తమ పెర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

 జబర్దస్త్ టీం కామెడీ...

జబర్దస్త్ టీం కామెడీ...


జబర్దస్త్ టీం కామెడీ షో ఆకట్టుకుంది. రాకెట్ రాఘవ, చలాకీ చంటి తదితరులు తమ ప్రదర్శనతో సభికులను నవ్వించారు.

చార్మి పెర్పార్మెన్స్

చార్మి పెర్పార్మెన్స్


గల్ఫ ఆంధ్రా మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో హీరోయిన్ చార్మి తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

అవకాశాలు లేని చార్మి

అవకాశాలు లేని చార్మి


హీరోయిన్ చార్మికి ఈ మధ్య సినిమా అవకాశాలు చాలా వరకు తగ్గిన సంగతి తెలిసిందే. అందుకే అందుకే ఖాళీగా ఉండకుండా ఇలాంటి కార్యక్రమాలపై కూడా దృష్టి సారించింది.

పూనమ్ బజ్వా

పూనమ్ బజ్వా


హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో చేసినా పెద్దగా ఫలితం లేక పోవడం పూనమ్ బజ్వా కూడా ఇలాంటి కార్యక్రమాల్లో స్టేజీ షోలతో బిజీ అయిపోయింది.

కామ్నా జఠ్మలానీ

కామ్నా జఠ్మలానీ


చార్మి, పూనమ్ బజ్వాల తరహాలోనే మరో హీరోయిన్ కామ్నా జఠ్మలానీ కూడా తన కెరీర్ కొనసాగిస్తోంది.

సింగర్ కారుణ్య

సింగర్ కారుణ్య


టాలీవుడ్ సింగర్ కారుణ్య గల్ప్ ఆంధ్రా మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో పాటతో పాటు ఆటతోనూ అలరించాడు.

అవార్డుల కార్యక్రమం

అవార్డుల కార్యక్రమం


ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సునీత తదితరులు ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ గెటప్‌లో అలీ...

పవన్ కళ్యాణ్ గెటప్‌లో అలీ...


అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ మాదిరి బాబా గెటప్‌లో దర్శనం ఇచ్చిన అలీ ఆ సినిమాలోని పాటకు స్టెప్స్ వేసి అలరించాడు.

విజిల్స్, కేరింతలు...

విజిల్స్, కేరింతలు...


పవన్ కళ్యాణ్ అంటేనే ఓ రేంజిలో క్రేజ్ ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గుర్తొచ్చేలా అలీ స్టెప్పులేస్తుంటే ఆడియన్స్ ఊరికే ఉంటారా....! విజిల్స్, కేరింతలతో సందడి చేసారు.

జోష్‌గా స్టెప్పులేసిన హేమ

జోష్‌గా స్టెప్పులేసిన హేమ


హాస్య నటుడు అలీ‌తో పాటు...హాస్య నటి హేమ కూడా తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది.

హైలెట్...

హైలెట్...


పవన్ కళ్యాణ్ గెటప్‌లో అలీ పెర్ఫార్మెన్స్.....టోటల్ గల్ప్ ఆంధ్రా మ్యూజిక్ అవార్డుల కార్యక్రమానికే హైలెట్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X