For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చేనేత కార్మికుల కష్టాలకు ప్రతిరూపం గల్ఫ్.. చేతన్ మద్దినేని

  By Rajababu
  |

  సామాజిక సమస్యలను, అంశాలను కథాంశాలుగా ఎంచుకొని సినిమాలో రూపొందించే దర్శకుల్లో పీ సునీల్ కుమార్ రెడ్డి ఒకరు. ఆయన రూపొందించిన సొంతూరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ, మిస్ లీలావతి, ఏటీఎం చిత్రాలు సామాజిక పరిస్థితులకు అద్దం పట్టాయి. తాజాగా సునీల్ కుమార్ రెడ్డి రూపొందించిన చిత్రం గల్ఫ్. చేనేత కార్మికుల సమస్యలను ఇతివృత్తంగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో హీరోగా చేతన్ మద్దినేని నటించారు. చేతన్ తన పాత్ర, సినిమాకు సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకొన్నారు. ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే.

  సిరిసిల్లా చేనేత కార్మికుడి కొడుకుగా..

  సిరిసిల్లా చేనేత కార్మికుడి కొడుకుగా..

  గల్ఫ్ చిత్రంలో నా పాత్ర పేరు శివ. సిరిసిల్లా చేనేత కార్మికుడి కొడుకు పాత్రను పోషిస్తున్నాను. ఊర్లో అల్లరి చిల్లరిగా తిరిగే రోల్. గల్ఫ్ కోసం వెళ్లే నా ఫ్రెండ్స్‌ను చూసి నేను కూడా గల్ఫ్‌కు వెళ్లడానికి సిద్ధపడుతాను. గల్ఫ్‌కు వెళ్లడం నా కల అనే రేంజ్‌లో ఉంటాను. అక్కడికి వెళ్లిన తర్వాత నాకు ఎదురైన పరిస్థితులేమిటీ అనే చిత్ర కథ.

  క్యూట్ లవ్ స్టోరి..

  క్యూట్ లవ్ స్టోరి..

  గల్ఫ్‌కు వెళ్లే సమయంలో ఫ్లయిట్‌లో హీరోయిన్ పరిచయం అవుతుంది. మా మధ్య జరిగిన క్యూట్ లవ్ స్టోరీ బాగుంటుంది. తెలంగాణ నేటివిటి కోసం, భాష మాట్లాడటానికి చాలా కష్టపడ్డాను. షూటింగ్‌కు ముందు చాలా హోంవర్క్ చేశాను. దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి చేసే రీసెర్చ్‌లో నేను పాల్గొన్నాను. దాంతో పాత్రపై పూర్తిగా అవగాహన కలిగింది. డబ్బింగ్ చాలా కష్టపడి చెప్పాను. నేను పడిన కష్టం తెరమీద స్పష్టంగా కనిపిస్తుంది.

  దుబాయ్ ఫ్లయిట్‌లో గల్ప్ కార్మికుల గురించి..

  దుబాయ్ ఫ్లయిట్‌లో గల్ప్ కార్మికుల గురించి..

  గల్ఫ్ గురించి నాకు పెద్దగా తెలియదు. నా పేరేంట్స్ అమెరికాలో ఉంటారు కాబట్టి నేను రెగ్యులర్‌గా యూఎస్ వెళ్లేవాడిని. అప్పుడు దుబాయ్ మీదుగా వెళ్లే ఫ్లయిట్‌లో ప్రయాణించేవాడిని. అప్పుడు నాకు చుట్టుపక్కల గల్ఫ్‌కు వెళ్లే కార్మికులకు వెళ్లే వారితో మాట్లాడే వాడిని. అక్కడి పరిస్థితులు తెలుసుకొనేందుకు ప్రయత్నించేవాడిని అని చేతన్ అన్నారు.

  గల్ఫ్ చిత్రం రెండోది..

  గల్ఫ్ చిత్రం రెండోది..

  గల్ఫ్ చిత్రం నాకు రెండోది. దిల్ రాజు, దర్శకుడు మారుతి రూపొందించిన రోజులు మారాయి చిత్రం నాకు మొదటిది. సునీల్ కుమార్ రెడ్డి తీసిన సొంతూరు, గంగపుత్రులు, క్రిమినల్ ప్రేమ కథ అన్నీ చూశాను. క్రిమినల్ ప్రేమ కథ చిత్రాన్ని 60 రోజున బ్లాక్‌లో టికెట్ కొని చూశాను. రియలిస్టిక్ చిత్రాలు నిర్మించడంలో సునీల్ కుమార్ రెడ్డిది ప్రత్యేకమైన స్టయిల్. రోజులు మారాయికి గల్ఫ్ చిత్రం పూర్తిగా భిన్నమైంది.

  నా జీవితానికి పూర్తి వ్యతిరేకమైనది..

  నా జీవితానికి పూర్తి వ్యతిరేకమైనది..

  గల్ఫ్ చిత్రంలో పోషించిన నా జీవితానికి చాలా వ్యతిరేకమైనది. గల్ఫ్ చిత్రంలో ఓ కార్మికుడి కొడుకుకు ఎదురై సమస్యలు, బాధలు ఎలా ఉంటాయి అనేది తెలిసింది. నటించకూడదని, రియలిస్టిక్‌గా ఉండాలని దర్శకుడు సూచనలిచ్చారు. రియలిస్టిక్‌గా ఉండటానికి బ్లాక్ కలర్, షేడ్స్ కనిపించడానికి మేకప్ విషయంలో శ్రద్ధ తీసుకొన్నారు. రియలిస్టిక్‌గా ఉండటానికి డైరెక్టర్ ముఖానికి మట్టి రాసేవారు. ఈ సినిమాలో లవ్, ఎమోషన్, పెయిన్ అని కోణాలు ఉంటాయి. ప్రేక్షకుడికి ఈ సినిమా కనెక్ట్ అవుతుందనే విశ్వాసంతో ఉన్నాను. ఈ సినిమాలో చేతన్ కనిపించడు. తెరమీద శివనే కనిపిస్తాడు. నేను ఎలా నటించాను అనే విషయాన్ని ప్రేక్షకులకే వదిలేశాను. ప్రేక్షకుల తీర్పు కోసం వేచి చూస్తున్నాను.

  ఫస్ట్ ర్యాంక్ రాజు చిత్రంలో...

  ఫస్ట్ ర్యాంక్ రాజు చిత్రంలో...

  నా తదుపరి చిత్రం ఫస్ట్ ర్యాంక్ రాజు. మారుతి నిర్మాణ సారథ్యంలో జరుగుతున్నది. కన్నడంలో కూడా అదే పేరుతో రూపొందింది. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ నడుస్తున్నది. మరో నెలలోపు ఈ సినిమా ప్రారంభమవుతున్నది. ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్‌గా రూపొందనున్నది. కామెడీ, సెటైర్ అంశాలు ఉంటాయి. ఇక హై ఎండ్ ఫోన్ అనే చిత్రంలో కూడా నటించాను. ఆ చిత్రం ఫస్ట్ కాపీ త్వరలోనే రానున్నది.

  వైజాగ్ నా స్వస్థలం..

  వైజాగ్ నా స్వస్థలం..

  నేను బెంగళూరుకు సమీపంలోని రిషీ వ్యాలీలో చదివాను. ఆ తర్వాత వైజాగ్‌లోనే ఇంజినీరింగ్ చేశాను. మాస్వస్థలం వైజాగ్. కానీ నా పేరేంట్స్ అమెరికాలో ఉంటారు. ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత సినీ రంగానికి వచ్చాను. ఆ సమయంలో వైజాగ్‌లో షార్ట్ ఫిలిం మానియా ఉండేది. అప్పుడు నేను ఓ షార్ట్ ఫిలింలో నటించాను. నా తండ్రి చూసి సినిమాలో నటించమని సూచించాడు. ఆ తర్వాత సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ పొందాను. ఆ తర్వాత దిల్ రాజు, మారుతి రూపొందించిన రోజులు మారాయి చిత్రంలో అవకాశం వచ్చింది.

  English summary
  Sunil Kumar Reddy, who is well-known for directing films like 'Sontha Ooru', 'Gangaputhrulu', 'Oka Romantic Crime Katha' etc, is made a movie titled 'Gulf'. The film will reflect the lives of Indian people in Gulf countries and the troubles they are facing. He is making this film on Sravya films banner. Heor is Chethan Maddineni.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X