క్రిస్మస్ కానుకగా 'గలివర్ ట్రావెల్స్' త్రీడీ చిత్రం
జోనాథన్ స్విప్ట్ రాసిన 'గలివర్ ట్రావెల్స్'ఇప్పటికే ఐదు సార్లు తెరకెక్కింది. అనేకసార్లు టీవిల్లో,రేడియోల్లో పోగ్రాములుగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మరోసారి పిల్లలను అలరించటానికి ముందుకొస్తోంది. ఈ చిత్రం క్రిస్ మెస్ కానుకగా డిసెంబర్ 25న అందరినీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ చిత్రం కథలో హీరో గలివర్...సముద్రంలో వెళుతున్న ఓడ తలకిందులై ఏదో వింత దీవిలోకి చేరుకుంటాడు. ఆ దీవిలో చేతి వేలి ప్రమాణంలో ఉండే లిల్లీపుట్లు నివాసం ఉంటూంటారు. అక్కడ వారి రాజ్యం నడుస్తూంటుంది. వాళ్లకి గలీవర్..ఓ భారీ కాయుడులా కనపడతాడు.
స్పృహ తప్పి పడిపోయిన గలివర్‌ని చూసి భయపడి వాళ్లంతా కలిసి అతడిని కట్టేస్తారు. వాళ్ల రాజు ఇతడిని భయంభయంగానే చూడ్డానికి వస్తాడు. మెలకువ వచ్చిన గలివర్ వాళ్ల భయాన్ని చూసి నవ్వుకుని తనతో ప్రమాదం లేదని చెబుతాడు. ఆపై వాళ్లందరికీ మంచి స్నేహితుడైపోతాడు. అయితే ఆ దీవిలో రెండు రాజ్యాలుంటాయి. వాళ్లలో వాళ్లకి పడదు. వాటి మధ్య యుద్ధం జరుగుతుంది. అప్పుడు గలివర్ ఏం చేశాడు...ఆపై ఆ దీవి నుంచి ఎలా బయటపడ్డాడు..అనే సంఘటనలతో ఈ చిత్ర కథ నడుస్తూంది.
కొత్త సినిమాలో గ్రాఫిక్స్‌తో తీసిన దృశ్యాలు ఎంతగానో ఆకట్టుకుంటాయని, ముఖ్యంగా గలివర్‌కి, లిల్లీపుట్‌లకి మధ్య జరిగే సన్నివేశాల చిత్రీకరణ చాలా సహజంగా ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. అలాగే చిత్రంలో చాలా సన్నివేశాలకి తగినట్టు ముందే ఫోటోల్ని తీసుకుని వాటిని త్రీడీలో యానిమేట్ చేశారని దర్శకుడు చెప్తున్నారు. జాక్ బ్లాక్ ఈ చిత్రంలో గలీవర్ గా కనిపించనున్నాడు.


Click it and Unblock the Notifications











