twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహానటి సావిత్రిని ప్రొడక్షన్ బాయ్ కూడా, దిండు కింద 2 వేలు పెట్టి.. దయనీయ స్థితి కళ్లారా చూశా!

    |

    Recommended Video

    Gummadi venkateswara Rao Talks About Savitri

    క్యారెక్టర్ రోల్స్ తో గుమ్మడి వెంకటేశ్వర రావు తిరుగులేని నటన కనబరిచారు. ఎన్నో అద్భుత చిత్రాల్లో ఆయన నటించారు. ఎన్టీఆర్, ఎన్నార్, సావిత్రి వంటి గొప్ప నటులతో ఆ తరువాత తరం నటులు చిరంజీవి, నాగార్జున వంటి నటుల చిత్రాల్లో కూడా గుమ్మడి నటించారు. ఇటీవల జరిగి ఓ ఇంటర్వ్యూలో మహానటి సావిత్రి గురించి గుమ్మడి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు. సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి చిత్రం అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనితో ప్రస్తుతం సినీ వర్గాల్లో సావిత్రి గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

    తీపి, చేదు రెండూ ఉన్నాయి

    తీపి, చేదు రెండూ ఉన్నాయి

    సావిత్రితో కలసి తాను అనేక చిత్రాల్లో నటించానని గుమ్మడి అన్నారు. సావిత్రి నన్ను అన్నయ్య అని పిలిచేది. సావిత్రి విషయంలో తనకు తీపి జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు రెండూ ఉన్నాయని గుమ్మడి అన్నారు.

     సావిత్రి చివరి రోజుల్లో

    సావిత్రి చివరి రోజుల్లో

    అవి సావిత్రి చివరి రోజులు. స్టార్ డం బాగా తగ్గిపోయింది. సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఆ సమయంలో ఓ చిత్రంలో సావిత్రికి తల్లి పాత్ర ఇచ్చారు. ఆ చిత్రంలో నేను కూడా నటించా అని గుమ్మడి అన్నారు.

    భోజనం పెట్టా

    భోజనం పెట్టా

    ఆ చిత్రంలో నటించే సమయంలో భోజనం టైం అయింది. కొంత మంది ఇంటి నుంచి భోజనం తెప్పించుకుంటారు. మిగిలిన వారికి ప్రొడక్షన్ బాయ్ భోజనం తీసుకురావాలి. సావిత్రికి ఇంటినుంచి భోజనం రాలేదు. ఆమె ఒక్కటే ఒంటరిగా కూర్చుని ఉంది. భోజనం చేయలేదా అమ్మ అని అడిగా.. ఆకలిగా లేదు అని సమాధానం ఇవ్వడంతో నాకు పరిస్థితి అర్థం అయిందని గుమ్మడి అన్నారు. భోజయం చేద్దాం రమ్మని పిలిస్తే వద్దని చెప్పింది. నీవు తింటేకానీ నేను కూడా తినను అని చెప్పడంతో కన్నీళ్లు పెట్టుకుని వచ్చింది అని గుమ్మడి అన్నారు.

    స్టార్ స్టేటస్ లేకపోతే అంతే

    స్టార్ స్టేటస్ లేకపోతే అంతే

    నటుల జీవితాలకు ఇది ఓ ఉదాహరణ అని గుమ్మడి అన్నారు. అప్పటి వరకు ఓ వెలుగు వెలిగిన సావిత్రి చివరి రోజుల్లో స్టార్ స్టేటస్ కోల్పోయింది. దీనితో ఆమెని కనీసం ప్రొడక్షన్ బాయ్ కూడా పట్టించుకోలేదని గుమ్మడి అన్నారు.

    పరామర్శించడానికి వచ్చి

    పరామర్శించడానికి వచ్చి

    ఈ సంఘటన కూడా సావిత్రి చివరి రోజుల్లోనే జరిగిందని గుమ్మడి అన్నారు. ఓ సారి నాకు ఆరోగ్యం బాగోలేక వారం రోజులు మంచం మీది నుంచి లేవలేదు. పరామర్శించడానికి సావిత్రి వచ్చింది. ఎలా ఉన్నావు అన్నయ్యా అని అడిగింది. ఇప్పుడు పరవాలేదు అని చెప్పా. డాక్టర్ ఇంజక్షన్ ఇవ్వడంతో సైలెంట్ గా పడుకుని ఉన్నా. సావిత్రి తిరిగి వెళుతూ తలగడ సర్దినట్లు అనిపించింది.

    దిండు కింద 2 వేలు పెట్టి

    దిండు కింద 2 వేలు పెట్టి

    సావిత్రి వెళ్ళిపోయాక లేచి చూస్తే దిండు కింద రూ 2 వేలు ఉన్నాయి. ఎందుకు 2 వేలు అని ఫోన్ చేసి అడిగా.. మీరు మరచి పోయారు అన్నయ్యా.. గతంలో మీదగ్గర తీసుకున్న అప్పు అది అని గుర్తు చేసింది. నేను చనిపోయే లోపు ఎవరికీ బాకీ ఉండకూడదు అని సావిత్రి చెప్పింది. ఆ మాట చెప్పగానే నా కళ్ళు చెమ్మగిల్లాయి అని గుమ్మడి అన్నారు.

    ఆమె ఆస్తుల విలువ

    ఆమె ఆస్తుల విలువ

    సావిత్రి అప్పట్లో సంపాదించిన ఆస్తులన్నీ ఉండి ఉంటె ఇప్పుడు కొన్ని వందల కోట్ల విలువ చేసి ఉండేవని గుమ్మడి అన్నారు. సంపద మొత్తం పోగొట్టుకుంది. భర్త, బందువులు, స్నేహితులు అందరూ ఆమెని మోసం చేసారని గుమ్మడి అన్నారు. ఆమె దయనీయ స్థితిని కళ్లారా చూశానని ఆయన తెలిపారు. అలాంటి నటి శతాబ్దానికి ఒక్కరే పుడతారని గుమ్మడి అన్నారు.

    English summary
    Gummadi Venkateswara Rao Emotional Words About Mahanati Savitri Last Days. Savitri called me as Annayya says Gummadi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X