గుమ్మడి జ్ఞాపకాలు
పాత కెరటాలు
అవిచిరంజీవి నటుడిగా పేరు తెచ్చుకుంటున్నరోజులు. 1981లో ఎన్టీఆర్ సరసన తిరుగులేని మనిషి చిత్రంలోచిరంజీవి ఆయన బావమరిదిగా నటిస్తున్నారు.చిరంజీవిస్పార్క్‌ను ఆనాడే గమనించిన ఎన్టీఆర్ ఒకరోజుసెట్స్ మీద ఏం బ్రదర్, ఏమైనా జాగ్రత్తపడుతున్నారా? అని అడిగారు. చిరంజీవి తండ్రివెంకటరావు ఆ మధ్యలోనే కొడుకుకిఫియట్ కారు కొనిచ్చారు ( ఆ కారు నెం ఎఎఎన్:2087-అది అచ్చివచ్చిన కారు కావడంతో చిరంజీవిఇప్పటికీ ఉంచుకున్నారు). ఈ మధ్యనేకారొకటి తీసుకున్నానండి అని చిరంజీవి ఎన్టీఆర్‌కువినయంగా చెప్పారు. దానికి ఎన్టీఆర్‌ఇనప ముక్కల మీద డబ్బు వృధా చేయకండిబ్రదర్! ఇళ్ళూ, పొలాలూకొనుక్కోండి. మనకు వేషాలు లేనప్పుడుపొలం దున్నుకుని బతకవచ్చు అన్నారు.రామారావు గారి హితబోధ చిరంజీవిపైబాగా పనిచేసింది. పొదుపు అవసరాన్ని గ్రహించి, ఆయన ఆ హితబోధనుఆచరణలో పెట్టారు.


Click it and Unblock the Notifications











